సంక్రాంతి అంటేనే తెలుగు వారికి పెద్ద పండుగ. లోగిళ్ళలో సందళ్ళు, ముద్దు ముచ్చట్లు, ఇలా హడావిడే హడావిడి. ఓ వైపు కోడి పందేలు, మరో వైపు పడుచు అందాలు, ఎటు చూసినా ఆకర్షణలే. ఇవి చాలవన్నట్లుగా కొత్త సినిమాలతో నూతన ఉత్సాహం చెప్పనలవికానిదే. మరి కొద్ది రోజుల్లో 2019 సంవత్సరం లోకి ప్రవేశిస్తున్న వేళ ఈసారి సంక్రాంత్రి సూపరెహే అన్న రేంజిలో ఉంటుందట.


నాలుగు టాప్ మూవీస్ ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ముందుగా అన్న గారి బయోపిక్ ఎంటీయార్ జనవరి 9న రాబోతోంది. ఆ సినిమాపై మంచి ఆంచనాలే ఉన్నాయి. వెండితెరను తన అసమాన నటనతో సుసంపన్నం చేసిన నందమూరి జీవిత కధనం అంటే ఆ ఇంటెరెస్ట్ వేరుగా ఉంటుంది. అందులోనూ బాలయ్య తన తండ్రి పాత్రలో మెరవనున్నాడు. ఇక కాస్టింగ్ క్ర్యూ కూడా గొప్పగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఆడియో, టీజర్ కూడా సినిమా రేంజిని పెంచేస్తున్నాయి.


అదే వరసలో వినయ విధేయ రామ మూవీ కూడా సంక్రాంతి పందెంలో ఉంది. జనవరి 11న విడుదల అవుతున్న ఈ మూవీ బోయపాటి రామ్ చరణ్ ఫస్ట్ కాంబో. మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి తో రంగస్థలం వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన చెర్రీ చేస్తున్న సినిమా కావడంతో హిట్ గ్యారంటీ అంటున్నారు. ఇక 2 ఓ మూవీతో ఈ మధ్యనే బంపర్ హిట్ కొట్టిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ పెట్టా కూడా వస్తోంది. ఈ మూవీపై కూడా బాగా అంచనాలు ఉన్నాయి. రజనీకి మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని అంటున్నారు.


వీటితో పాటే ఎఫ్ 2 మూవీ వస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ ఫన్ క్రియేట్ చేసే మూవీట. ఈ మూవీలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ పక్కన మెహ్రిన్ కౌర్ నటిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ తో వస్తున ఈ మూవీ సంక్రాంతికి సరైన సినిమా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే నాలుగే నాలుగు అన్నట్లుగా వస్తున్నా ఈ సిన్మాలు ఈ పెద్ద పండుగను మరింత గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: