రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా కు కేటీఆర్ ముఖ్య అతిధిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..

రంగస్థలాన్ని వాడుకొన్నాను

అందరికీ నమస్కారం. ముందుగా స్వయంకృషితో టాలీవుడ్‌కు, భారతీయ సినిమా పరిశ్రమలో దిగ్గజం. సముద్రమంత అభిమానాన్ని, అద్భుతమైన వారసులను అందించిన మెగాస్టార్ చిరంజీవి గారికి. రాంచరణ్ తన ప్రసంగంలో ఏదీ మర్చిపోలేదు. రాజకీయాల్లో మేము మాట్లాడే దానికంటే బాగా మాట్లాడాడు. త్వరలోనే పాలిటిక్స్‌లోకి వస్తాడేమో అనిపిస్తున్నది. దానికి ఇంకా టైమ్ ఉంది. 


 వినయ విధేయ రామ ట్రైలర్ టాక్ : రామ్ చరణ్ హల్క్ బాడీతో... డబ్ల్యు.. డబ్ల్యు..డబ్ల్యు లుక్...!

నేను ధ్రువ సినిమా ఫంక్షన్‌కు వచ్చాను. అది హిట్ అయ్యింది. రంగస్థలం ముందు మేము ఒకచోట కలిశాం. అప్పుడు గడ్డంతో కనిపించాడు. ఏంటనీ అడిగితే రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తున్నాని చెప్పాడు. అయితే అర్భన్ బ్యాక్ డ్రాప్‌లోనే సినిమా చేయాలని సూచించాను. కానీ రంగస్థలం చూశాక రాంచరణ్ కెరీర్‌లోనే అద్బుతమైన సినిమాగా నిలిచింది. వినయ విధేయ రామలో ఎవరు వినయంగా ఉంటారు. ఎవరు విధేయంగా ఉంటారు అని చిరంజీవిగారితో అడిగాను. కానీ ఆయన ట్రైలర్ చూస్తే తెలుస్తుందన్నారు. కానీ ట్రైలర్ చూస్తే విధ్వంస రాముడు మాత్రమే కనిపించారు. అయితే సినిమాలో వినయ విధేయ రాముడు కనిపిస్తారేమో చూడాలి. సాధారణంగా నేను ఇలాంటి సినిమాలు చూడను కానీ బోయపాటి కోసం నేను ఈ సినిమా చూస్తాను. 

మరింత సమాచారం తెలుసుకోండి: