తెలుగులో నేను శైలజా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ సినిమాతో హిట్ అందుకోగా తర్వాత వచ్చిన నేను లోకల్ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టింది. మహానటితో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలిచిన కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం తెలుగులో కన్నా తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది కీర్తి సురేష్.


మళయాలం నుండి వచ్చిన కీర్తి సురేష్ తెలుగు తమిళ సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇక ఈమధ్య తను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పింది కీర్తి సురేష్. తనకు అప్పుడే పెళ్లి వయసు రాలేదని.. తానింకా చిన్నపిల్లనే అంటుంది కీర్తి సురేష్ అక్కడి వరకు బాగనే ఉన్నా ఎలాంటి వరుడు కావాలి అంటే తమిళ హీరోలు విజయ్, విక్రం లాంటి వారు కావాలని అంటుంది.


మళయాళం నుండి ఆమెను తీసుకొచ్చి హీరోయిన్ గా క్రేజ్ వచ్చేలా చేసింది తెలుగు పరిశ్రమ. అయితే తెలుగులో ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రమే నటించింది కీర్తి. తనకు కాబోయే వాడు స్టైల్, స్మైల్ తమిళ హీరోలు విజయ్, విక్రంల్లా ఉండాలని అంటుంది. విజయ్ తో సర్కార్, విక్రం తో స్వామి స్వేర్ సినిమాల్లో జత కట్టింది కీర్తి.


అయితే కీర్తి సురేష్ ఈ కామెంట్స్ పై తెలుగు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. తెలుగులో నాలుగు సినిమాలు చేసిన అమ్మడు తెలుగు హీరోల గురించి చెప్పకుండా తమిళ హీరోలను ఉదహరణగా చెప్పడం విశేషం. దాని మీద సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మీద కామెంట్స్ చేస్తున్నారు తెలుగు ఆడియెన్స్. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తన వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కీర్తి చెప్పిన దాన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా ఉంటే బెటర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: