భారత దేశంలో ఈ మద్య మీ టూ ఉద్యమంతో ఎంతో మంది సెలబ్రెటీలు, సాదారణ మహిళలు సైతం తమపై జరిగిన లైంగికదాడుల విషయం గురించి బహిరంగంగా వెల్లడిస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నారు.  బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ పలువురు సినీతారలు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపులు, దాడుల గురించి సోషల్ మీడియాలో వెల్లడించి కలకలం సృష్టించారు.  ఇక దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి అయితే ఏకంగా ప్రముఖ సినీ రచయిత వైరముత్తు గతంలో తనపై లైంగిక వేధింపులు జరిపాడని స్టేట్ మెంట్ ఇచ్చింది. దాంతో కోలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి.
Image result for చిన్మయి ప్రముఖ సినీ రచయిత
దాంతో ఈ  ఎఫెక్ట్ మాత్రం చిన్మయిపై పడింది. ఆమెకు ఛాన్స్ లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. డబ్బింగ్ అసోషియేషన్ నుండి తననుతొలగించారని చిన్మయి ఆరోపించింది. కాగా, అసోషియేషన్ కు ఆమె చెల్లించాల్సిన మొత్తం చెల్లించని కారణంగానే ఆమెను బహిష్కరించినట్లుగా చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆమెను మళ్లీ డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ లో జాయిన్ అయ్యేందుకు ఓకే చెప్పారు. కాకపోతే కొన్ని కండీషన్స్ పై తీసుకుంటామరి చెప్పారట. 
Image result for చిన్మయి ప్రముఖ సినీ రచయిత
ఆమె అసోషియేషన్ కు 1.5 లక్షల రూపాయలు కట్టాలని దాంతో పాటు అసోషియేషన్ కు మరియు అసోషియేషన్ అధ్యక్షుడు రాధా రవికి క్షమాపణలు చెప్పాలని కండీషన్ లో పేర్కొన్నారు. గతంలో రాధా రవి పై చిన్మయి సెన్సేషనల్ ఆరోపనలు చేసిన విషయం తెలిసిందే. అందుకే ఆమె క్షమాపణలు చెప్పాలంటూ సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఈ కండీషన్స్ పై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణంగా అసోషియేషన్ లో జాయిన్ అయ్యేందుకు 2500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాని నేను ఎందుకు 1.5 లక్షలు చెల్లించాలంటూ ప్రశ్నించింది. నన్ను టార్గెట్ చేసి క్షమాపణలు చెప్పించేందుకు అసోషియేషన్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసోషియేషన్ కండీషన్స్ కు తాను ఒప్పుకునేది లేదు అంటూ చిన్మయి అంటోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: