కైరా అద్వానీ ఇపుడు టాలీవుడ్ ని కుదిపేస్తున్న బ్యూటీ. చేసింది  తెలుగులో ఒక్క సినిమా భరత్ అనే నేను. ఇక రెండవ మూవీ మెగా పవర్ స్టార్ చరణ్ తో జోడీ కట్టింది. అయినా ఎక్కడా కైరా జోరు తగ్గడంలేదు. ఆమె కొసం నిర్మాతలు క్యూ కడుతూంటే హీరోలు చేసేందుకు రెడీ అంటున్నారు. కైరా మాత్రం నింపాదిగా న్యూ యియర్ వేడుకలకు ముస్తాబవుతోంది.


నెట్ లో చిక్కిన సాలీడులా లేటెస్ట్ ఫోటోషూట్ తో కొత్త సంవత్సరానికి వెల్ కం చెబుతోంది బాలీవుడ్  కైరా అద్వాని. ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇస్తే సెట్టయిపోతారో అలాంటి ట్రీట్ ని మస్త్ గా ప్లాన్ చేసింది ఈ ముంబై బ్యూటీ. ఇప్పటికే 27లక్షల మంది ఫాలోవర్స్ తనని ఫోటో షేరింగ్ సైట్ లో అనుసరిస్తున్నారంటే తన రేంజు ఏ లెవల్లో  ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఇక ఇండస్ట్రీలో ప్రవేశించిన కేవలం రెండు మూడేళ్లలోనే అగ్ర కథానాయికగా ఏలేస్తోంది ఈ అందగత్తె. ఎలా కట్టేసుకోవాలో, మరెలా అకట్టుకోవాలో తెలిసిన కైరా ఔరా అనిపించెస్తోంది. ఇక కొత్త ఏడాది 2019 టాలీవుడ్లో కైరా దూకుడుకు టర్నింగ్ పాయింట్ తెస్తుందని అంటున్నారు. చరణ్ తో చేసిన వినయ విధేయ రామాతో బంపర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. 
అదే విధంగా ఈ మూవీలో కైరా అందాలు కుర్ర కారు మనసు దోస్తాయని కూడా చెబుతున్నారు. తన‌ గ్లామర్ ని అలా పరిచేసిన కైరా మరిన్ని చాన్స్ లను ఈ మూవీ తరువాత తెచ్చుకోవడం ష్యూర్ అనేస్తున్నారు. మరి చూడాలి కైరాని 2019 ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: