తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవీ సూపర్ హిట్ అయ్యింది.  గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న రజినీకాంత్ 2.0 సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు.  ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే  కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో  ‘పెట్టా’సినిమాకి సైన్ చేశాడు.  2.0 మూవీ సక్సెస్ అందుకున్న సమయంలోనే ‘పెట్టా’మూవీని కంప్లీట్ చేశారు రజినీకాంత్.  ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, లిరిక్స్, టీజన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇటీవ‌ల ఈ సినిమా ట్రైల‌ర్ త‌మిళ వ‌ర్షెన్‌లో విడుద‌ల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. తెలుగు ట్రైల‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. కాకపోతే తమిళ్ వర్షన్ లో చూపించినంతగా చూపించకున్నా..న్యూ ఇయ‌ర్ విషెస్ చెబుతూ.. సంక్రాంతికి పేట‌లో క‌లుస్తాను అని ర‌జ‌నీకాంత్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. పూర్తి ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. ఇక సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను వచ్చే నెల మొదటి వారంలో భారీగా, విభిన్నంగా నిర్వహించనున్నట్లు స‌మాచారం.
Peta Telugu Official Trailer Sneak Peek
ఇక సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో రజినీకాంత్ లుక్స్ చాలా స్టైలిస్‌గా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ‘బాషా’ మూవీ  తర్వాత రజినీకాంత్ నటించిన ‘పేట’ సంక్రాంతికి విడుదలవుతోంది.అనిరుధ్ ర‌విచంద్రన్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. సిమ్రాన్‌, విజ‌య్ సేతుప‌తి, బాబీ సింహా, మేఘా ఆకాశ్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: