తనతో వరసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వడమే కాదు, ఇంటర్నేషనల్ నేమ్  అండ్ ఫేమ్ కల్పించిన దర్శక ధీరుడు రాజమౌళి అంటే ప్రభాస్ కి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అటువంటి ప్రభాస్ రాజమౌళిని ఉద్దేశిన చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి విషయంలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు దుమారానే రేపుతున్నయి. ఇంతకీ మన యంగ్ రెబెల్ స్టార్ ఏమన్నాడంటే.


ఏదో సాధించాలన్న తపన ఉన్న రాజమౌళి వంటి పిచ్చోళ్లు కొందరుంటారు.నిజంగా అదొక పిచ్చి, వెర్రితనం. ఏం జరగబోతోందో నిజంగా మనకు తెలియదు.వారు ఎటువంటి ఔట్ పుట్  ఇస్తారో కూడా ఊహించలేము.  కానీ ‘బాహుబలి’ విషయంలో ఆ పిచ్చితనమే పనిచేసింది. అయితే అన్ని సమయాల్లో అది పనిచేస్తుందని చెప్పలేం. నాలుగేళ్ల కెరియర్‌ని ఒక డైరెక్టర్ చేతిలో పెట్టడం కరెక్ట్ అని నేను చెప్పను అంటూ ప్రభాస్ ఘాటు కామెంట్స్ చేశారు.


 తాను నటించిన ‘బాహుబలి’ రెండు పార్టుల కోసం ఆయన 5సంవత్సరాలు దర్శకధీరుడు రాజమౌళికి అప్పగించారు. ‘ప్రతి ఒక్క సినిమాకు 5 సంవత్సరాలు కేటాయించలేము. అలా కేటాయిస్తే 3 - 4 సినిమాలకే నటీనటులు ముసలోళ్లైపోతారు అంటున్నాడు ప్రభాస్. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు 80-90 సంవత్సరాల వరకూ పని చేస్తారు.


 హాలీవుడ్‌లో అలా పనిచేస్తున్న డైరెక్టర్లు ఉన్నారు. కానీ హీరో, హీరోయిన్లు మాత్రం అలా చేయలేరు. కొంత కాలం తర్వాత వేరే రోల్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సినిమా కోసం 4-5 ఏళ్లు పనిచేయడం కరెక్ట్ కాదు అంటూ ఖరాఖండీగా చెప్పేశాడు ప్రభాస్.  మొత్తానికి బాహుబలి హిట్లను ప్రభాస్ ఆనందిస్తున్నాడా లేక అయిదేళ్ళ విలువైన టైం పోయిందని బాధ పడుతున్నాడా అన్నది అర్ధం కావడంలేదు. మొత్తానికి ప్రభాస్ కి ఓ జీవిత సత్యం తెలిసివచ్చిందనుకోవాలి. దాన్ని తోటి నటులకు పాఠంలా చెబుతున్నాడు అనుకోవాలేమో


మరింత సమాచారం తెలుసుకోండి: