టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కు అవకాశాలు ఇవ్వరంటూ ఎక్కడో ఓ చిన్న వాయిస్ వినిపిస్తుంది. ముంబై భామలైతే అడ్డు అదుపులేకుండా అందాల ప్రదర్శన చేస్తారు కాని మన తెలుగు హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ అంటే కాస్త వెనుకడుగు వేస్తారు. అందుకే తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వట్లేదు. అయితే ఈమధ్య స్కిన్ షో అవసరం లేకుండా ఉన్న సినిమాలు బాగానే వస్తున్నాయి. వాటిల్లో మళయాల భామలు కూడా ఏమాత్రం గ్లామర్ షోకి తావులేకుండా నటిస్తున్నారు.


తెలుగులో ఇప్పటివరకు వచ్చిన హీరోయిన్స్ జాబితా మిగతా వాళ్లకంటే తక్కువే. వారిలో స్వాతి ఒకరు. కలర్స్ షోతో సక్సెస్ అయిన ఈమె చిన్నగా సినిమాల్లోకి వచ్చింది. ఈమధ్యనే పైలెట్ ను పెళ్లాడిన స్వాతి పెళ్లి అయ్యింది కదా సినిమాలు మానేస్తానని అనుకుంటారేమో అసలు తగ్గేది లేదని చెబుతుంది.


రీసెంట్ గా స్వాతి ఓ మీడియా ఇంటర్వ్యూలో తన భర్త తన సినిమా కెరియర్ కొనసాగించమని చెప్పాడని అంటుంది. అయితే ఈసారి కాస్త గ్లామర్ షో కూడా అదరగొట్టేలా సిద్ధమవుతుందట స్వాతి. పెళ్లికి ముందే ఆమె స్కిన్ షో లాంటివి చేయలేదు పెళ్లి తర్వాత చేస్తుందా అని డౌట్ రావొచ్చు కాని స్వాతి చెబుతున్న మాటలు చూస్తున్నా ఇప్పుడు తానేంటో చూపిస్తా అనట్టు ఉంది.


పెళ్లికి ముందు కాస్త లావెక్కినట్టు కనిపించిన స్వాతి ఇప్పుడు సన్నబడ్డది. కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేకనే చిన్నగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందని అనుకున్నారు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా అని షాక్ ఇచ్చింది స్వాతి. మరి ఆమెకు ఈసారైనా మంచి సినిమాలు పడి సూపర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: