సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన శంకర్ రీసెంట్ గా 2.ఓతో తన సత్తా చాటాడు. వసూళ్ల సంగతి ఎలా ఉన్నా ఇండియన్ సిని లవర్స్ కు హాలీవుడ్ మూవీ ట్రీట్ ఇచ్చిన ఘనత శంకర్ కే చెల్లుతుంది. రోబో సీక్వల్ గా వచ్చిన 2.ఓ సినిమా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమా తర్వాత శంకర్ ఇండియన్-2 మూవీ చేస్తున్నాడు.


కమల్ హాసన్ తో చేసిన ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఈ సినిమా వస్తుంది. ఈమధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా దుల్కర్ సల్మాన్, శింభు నటిస్తున్నారట. సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ కాకముందే శంకర్ తన తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్నాడు.


ఈసారి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో శంకర్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ హృతిక్ రోషన్ కు ఓ సైన్స్ ఫిక్షన్ కథని వినిపించాడట శంకర్. 2.ఓలో పక్షి రాజు పాత్రకు ముందు హృతిక్ ను అనుకున్నాడట శంకర్. కాని హృతిక్ దాన్ని కాదన్నాడట. హృతిక్ మిస్ చేసుకున్న ఆ పాత్రని అక్షయ్ పోశించాడు. 2.ఓలో రజినితో పాటుగా అక్షయ్ కుమార్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.


ఇక శంకర్, హృతిక్ కాంబినేషన్ లో సినిమాపై అప్పుడే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ కూడా బడ్జెట్ భారీ రేంజ్ లో ఉంటుందట. శంకర్ సినిమా కాబట్టి సౌత్ లో కూడా ఈ మూవీ భారీ రేంజ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి శంకర్, హృతిక్ కాంబో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: