1920 అనే హర్రర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ తెలుగులో పూరి జగన్నాథ్ డైరక్షన్ లో హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ సినిమాతో క్రేజ్ వచ్చినా ఆ తర్వాత సినిమాల సెలక్షన్ బాగా లేక అమ్మడి కెరియర్ సక్సెస్ చేసుకోలేకపోయింది. సినిమాల్లో అవకాశాలు రాకున్నా ఏంటి సోషల్ ఫ్లాట్ ఫాం మీద అదా రెచ్చిపోతుంది.
అదా ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్, ఫ్యాన్స్ కోసం వారానికో ఫోటో షూట్ చేస్తుంది. ఇక అమ్మడు చూపించే అందాల ప్రదర్శనకు అందరు ఫ్లాట్ అవుతున్నారు. అన్ని ఉన్నా కూడా ఆమెకు ఎందుకో అవకాశాలు రావట్లేదు. అందుకే రకరకాల ప్రయత్నాల్లో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేలా చేస్తుంది. ఇక లేటెస్ట్ గా బెల్లీ డ్యాన్స్ తో బెంబేలెత్తేలా చేస్తుంది అదా శర్మ.
తను చేసే హాట్ వీడియోస్ లో ఏదో ఒక చిన్న మెసేజ్ ఉండేలా చూసుకునే అదా శర్మ లేటెస్ట్ గా బెల్లీ చేతిలో బీరు బాటిల్ తో బెల్లీ డ్యాన్స్ చేస్తూ ఫైనల్ గా షాక్ ఇచ్చింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేలా ఓ క్రేజీ టచ్ ఇచ్చింది అదా శర్మ. అయితే అమ్మడి ఇచ్చిన మెసేజ్ కన్నా ముందు చేసిన బెల్లీ డ్యాన్స్ ను ఎక్కువ మంచి ఫాలో అవుతున్నారు.
ఇదవరకు స్మోకింగ్ మీద కూడా అదా ఇలాంటి అటెంప్ట్ చేసింది. ఏది ఏమైనా అదా శర్మ ఈ బోల్డ్ అటెంప్ట్ కు అందరు ఫిదా అవుతున్నారు. బెల్లీ డ్యాన్స్ లో అదాని మించిన వారే లేరన్నంత రేంజ్ లో పొగిడేస్తున్నారు. సినిమా ఛాన్సులు రాకున్నా సరే ఇలాంటి క్రేజీ వీడియోస్ తో తన ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది అదా శర్మ.