పూర్వకాలం అంటే ఎర్లీ ఫిఫ్టీస్, సిక్స్టీస్ లో హీరోలు ఎలా ఉండేవారంటే సన్నని మీసం మాత్రమే ఉండేది. ముఖం అంతా తెల్లగా ఉంటూ అచ్చమైన, స్వచ్చమైన కళ ఉట్టిపడుతూ ఉండేది. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో ఎంటీయర్, ఏయన్నార్ సినిమాలు చూస్తే ఇది అర్ధమవుతుంది. అంటే హీరో అంటే ముఖంలోనే ఆ సున్నితత్వం ఉండాలని భావించేవారు. అందుకే మెరిసీ మెరియని నూనూగు మీసాలు తప్ప అంతా ముగ్ద మనోహర రూపంగా నాటి హీరోలు కనిపించేవారు. 


ఆ తరువాత కాలంలో మీసాలతో హీరోలు వచ్చేశారు. క్రిష్ణ, శోభన్ బాబు, క్రిష్ణం రాజు తరంలో ఓ మాదిరి మీసాలతో కనిపిస్తే చిరంజీవి, బాలయ్య తరంలో పెద్ద మీసాలతో హీరోలు వెండి తెరపై కనువిందు చేసేవారు. ఇక మిలీనియం తో హీరోలను తీసుకుంటే మీసాలే కాదు, జుట్టు బాగా పెంచుకుని అదో రకం రగ్డ్ ఫేస్ తో కనిపించే వారు. దాంతో హీరోలను కొత్తగా ఎలివేట్ చేస్తున్నట్లుగా డైరెక్టర్లు ఫీల్ అయ్యేవారు. ఇక గత కొన్ని ఏళ్ళలో చూసుకుంటే గడ్డం ఇపుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది.




ప్రతీ సినిమాలో హీరోకు గడ్డం ఉంటోంది. గడ్డం ఉన్న హీరో అంటేనే అమ్మాయిలు కూడా మ్యాన్లీ, హాండ్ సం అంటున్నారుట. ఆ విధంగా అర్జున్ రెడ్డితో గడ్డాన్ని పాపులర్ చేసిన ఘనత విజయ్ దేవరకొండది అయితే, నాన్నకు ప్రేమతో మూవీలో జూనియర్ ఎంటీయర్ కనిపించారు. . ఇక చిరంజీవి, బాలయ్యలకు కూడా ఈ గడ్డం గ్లామర్ తప్పలేదు. ఖైదీ నంబర్ 150లో చిరంజీవి గడ్డంతో కనిపిస్తే బాలయ్య కూడా లయన్ వంటి చిత్రాల్లా అదే మేకప్ తో కనిపించారు. మొత్తానికి గడ్డమే అందమని ఈ రోజు హీరోలు ప్రూవ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంతకాలం ఉంటుందో మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: