ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.  ఈ సందర్బంగా రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  అయితే ఎన్టీఆర్ నటనా జీవితంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు.  సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో ఆయన నటించని పాత్రలంటూ లేవు.

ఇక పౌరాణిక సినిమాల్లో కృష్ణుడు, రాముడు, అర్జునుడు, భీముడు, దుర్యోదనుడు ఇలా ఎన్నో పాత్రల్లో నటించిన ఆయన నర్తనశాలలో బృహన్నల పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు.  అయితే ఎన్టీఆర్ నటనా జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’గా..ఆయన రాజకీయ జీవితం నేపథ్యంలో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రెండు భాగాలు ఈ సినిమా రాబోతుంది. 
Image result for ntr katha nayakudu
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ మొదలైంది..ఇందులో నటించిన పాత్రదారులు ఒక్కొక్కరూ ప్రమోషన్ బిజీలో ఉన్నారు.  తాజాగా 'కథానాయకుడు' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను పొందడం విశేషం.
Image result for ntr katha nayakudu
ఈ సినిమా  పూర్తిగా ఎన్టీఆర్ నటనా జీవితానికి సంబంధించింది కనుక బాలకృష్ణ 63 గెటప్స్ లో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో విద్యాబాలన్,రకుల్,నిత్యామీనన్,హన్సిక, రానా .. సుమంత్,కల్యాణ్ రామ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలకృష్ణ సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారనే విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: