నందమూరి – మెగా ఫ్యామిలీల మధ్య వార్ తారస్థాయికి చేరుతోంది. బాలకృష్ణ ఎవరో తనకు తెలీదంటూ నాగబాబు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే! ఆ కామెంట్స్ పై బాలకృష్ణ అభిమానులు నాగబాబును నిలదీశారు. దీంతో నాగబాబు మళ్లీ సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు.

Image result for nagababu balakrishna

“బాలకృష్ణా.. ఆయనెవరు...? తానెప్పుడూ ఆ పేరు కూడా వినలేదే..!! ఆ... అవునవును.. ఆయన పెద్ద కామెడీ స్టార్.. పాత సినిమాల్లో ఆయన చాలా పాపులర్.. ఆయన తెలివారెవరుంటారు..” అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో నాగబాబు కామెంట్ చేసారు. ఈ కామెంట్స్ సెన్సేషన్ సృష్టించాయి. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న బాలకృష్ణ ఎవరో తెలీదనడం నాగబాబు అహంకారానికి నిదర్శనమంటూ పలు కామెంట్స్ సోషల్ మీడియాను నింపేశాయి.

Image result for nagababu balakrishna

ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా నాగబాబు అస్సలు రియాక్ట్ కాలేదు.. పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోయారు. అయితా నాగబాబు ఇటీవల చెన్నై వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయన్ను నిలదీశారు. బాలకృష్ణ ఎవరో తెలీదని ఎలా అంటారని ప్రశ్నించారు. కనీసం స్టేజ్ పై మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూనే ఉండిపోయారు. దీంతో నాగబాబు నవ్వుతూనే వెనుదిరిగారు.

Image result for nagababu balakrishna

అయితే.. తాజాగా సోషల్ మీడియాలో నాగబాబు ఈ అంశంపై స్పందించారు. వాస్తవానికి తాను బాలకృష్ణను టార్గెట్ చేయలేదన్నారు. అయితే కొంతమంది ఆయన అభిమానులు టార్గెట్ చేసినట్లుగా భావించి రియాక్ట్ అవుతున్నారన్నారు. గతంలో పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలీదంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ ను నాగబాబు గుర్తు చేశారు. అది చాలా బాధించడం వల్లే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని నాగబాబు చెప్పారు. 2014లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేసిన పవన్ కల్యాణ్ ఎవరో తెలీదంటూ బాలకృష్ణ చెప్పినప్పుడు, మీరు తెలీదని నేనంటే ఎందుకు ఫీలవుతున్నారని నాగబాబు ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: