బాలయ్యకు తన తండ్రిలా నటనలోనే కాదు, దర్శకత్వం కూడా చేయాలని ఎప్పటి నుంచో ఆశ. ఆయన నర్తనశాల మూవీని కూడా స్వయంగా తన దర్శకత్వంలో అప్పట్లో ప్రారంభించారు కూడా. అందులో ద్రౌపదిగా సౌందర్యని ఎన్నుకున్నారు. కొన్ని సీన్లు తీశాక హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించడంతో సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే బాలయ్య ఆ మూవీని నిలిపేశాడు. అంతేకాదు. కొన్నళ్ళ పాటు దర్శకత్వం మాట కూడా ఎత్తలేదు. 


ఇక బాలయ్య కు దర్శకునిగా అనుభవం చాలానే ఉంది. తన తండ్రి నందమూరి తారక రామారావు నటించి నిర్మించిన ఎన్నో చిత్రాలకు బాలయ్య అసిస్టంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ అనుభవం తెర ముందుకు ఎపుడూ రాలేదు కానీ, లేటెస్ట్ టాక్ ఏంటంటే బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న అన్నగారి జీవిత కధ ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు రెండు భాగాల వెనక దర్శకుడిగా కూడా బాలయ్య తన సత్తా చాటుకున్నారని ఇన్సైడ్ టాక్. అదేంటి ఈ మూవీకి క్రిష్ డైరెక్టర్ కదా అని అనుకోవచ్చు, క్రిష్ తో పాటు బాలయ్య కూడా తెర వెనక అర్టిస్టులకు సలహాలు సూచనలు ఇస్తూ సీన్ ఎలా రావాలో చెబుతూ మొత్తం సినిమా బాగా రావడానికి తన వంతుగా క్రుషి చేశారని చెబుతున్నారు.


ఈ విధంగా చూసుకుంటే ఈ సినిమాకు క్రిష్ తో పాటు బాలయ్య క్రెడిట్ కూడా ఉంటుందేమో అనుకోవాలి. ఎందుచేతనంటే ఈ మూవీ ఎన్టీఆర్ కి సంబంధించినది. ఆయన కుమారుడిగా బాలయ్య కంటే ఎవరికీ ఎక్కువగా విషయాలు తెలిసే అవకాశం లేదు. దానికి తోడు బాలయ్య ఫ్యాషనేట్ గా మూవీని తెరకెక్కించాల‌నుకున్నారు. ఇవన్నీ కలసి బాలయ్యలోని దర్శకున్ని బయటకు తెచ్చేశాయి. ఇదిలా ఉండగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునిగా బాలయ్య అన్నగారి వెంకటేశ్వర మహత్యంలో కనిపించిన సీన్ సంబంధించి పోటో ఒకటి ఈ రోజు విడుదల చేశారు. ఈ పిక్ లో అచ్చం అన్న గారి గా బాలయ్య ఒదిగిపోవదం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: