సంక్రాంతికి ఒక్కో స్టార్ దశ తిరుగుతుంది. పెద్ద పండుగ కావడంతో వచ్చిన ప్రతి సినిమాకు డబ్బులు వస్తాయి. ఇక బాగున్న సినిమా బ్లాక్ బస్టరే మరి. దాంతో కలెక్షన్లతో స్టార్ డం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్లీ ఏడాది వరకూ సరిపడా ఎనెర్జీని ఈ పండుగా సక్సెస్ ఇస్తుంది. ఇక చూసుకుంటే ఈసారి సంక్రాంతికి మూడు స్ట్రైట్ మూవీస్ విడుదల అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు బరిలో ఉంటే, వెటరన్ హీరోలు బాలయ్య, వెంకీ కూడా సై అంటున్నారు. 


ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో అన్న గారే హీరో. అంటే బాలయ్యే హీరో అన్న మాట. అక్కడ గ్లామర్ టచ్ అంటూ పెద్దగా అవసరం పడలేదు. ఎఫ్ 2 మూవీలో ఇద్దరు అందాల భామలు ఆడి పాడారు. ఒకరు తళుకు బెళుకున తమన్నా అయితే మరొకరు మెహ్రిన్ కౌర్. ఈ అమ్మడు కూడా గ్లామర్ కి సై అంది. అలాగే మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన వినయ విధేయ రామ మూవీ. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా ఉంది. 


ఈ మూడు సినిమాల్లో ఎఫ్ 2 హిట్ అయినా హీరోయిన్లకు పెద్దగా ఒరిగింది   ఏమీ లేదు. కానీ వినయ విధేయ రామా హిట్ అయితే మాత్రం టాలీవుడ్ ని ఏలడానికి సరి కొత్త స్టార్ గా కైరా దూసుకురావడం ఖాయం. ఇప్పటికే బన్నీతో ఓ మూవీకి సెలెక్ట్ అయిందని ఈ ముద్దు గుమ్మపై ప్రచారం జరుగుతోంది. సో వినయ విధేయ రమా హిట్ పడితే మాత్రం కొన్నాళ్ళ పాటు టాలీవుడ్  కైరా నానస్మరణ చేయకతప్పదు. సో సంక్రాంతి రేసులో ఈసారి కైరాను స్టార్ చేసేందుకు పండుగ రెడీ అవుతోందన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: