నయనతార అద్భుతమైన నటి. అందులో సందేహం లేదు. సరైన పాత్ర పడితే ఆమె ఎలా రెచ్చిపోతారో గత చిత్రాలు నిరూపించాయి. నయన్ లో అందం, అభిన‌యం రెండు కోణాలను తమిళ దర్శకులు ఎలివేట్ చేసినట్లుగా ఎవరూ చేయలేదేమో. మళ్ళీ అటువంటి పాత్ర ఒకటి నయన్ నటన ఆకలిని తీర్చబోతోందని టాక్.


రీసెంట్ గా రిలీజ్ అయిన ఐరా టీజర్ లో నయన్ నట విశ్వరూపం మరో మారు వెండి తెరను తాకబోతోంది. ఇక కధ కూడా మంచి సామాజిక అంశం కావడం, నయన్ నల్లమ్మాయ్, తెల్లమ్మయ్ గా కనిపించడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ మూవీ  రెండు కాలాల్లో కథ సాగుతోంది. ఇక ఆ పల్లె పట్టు పడతి జీవితంలో ఆరుగురు ఎవరు? అన్నది సస్పెన్స్ గా ఉంచారు. నాకే తెలియని ఎవరో ఆరుగురు నా తలరాతను తలకిందులుగా రాశారు..!


అందరికీ సంతోషంగా బతకడం ఓ కల. కానీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియని నాకు బతకడమే ఓ కల!!  అంటూ ఆడపిల్ల కష్టాన్ని నయన్ గొంతులో వినిపించారు. శత్రువులపై ప్రతీకారం సస్పెన్స్ ఎలిమెంట్ ఆకట్టుకుంటోంది. మరి నయనతార ద్విపాత్రాభినయం చేయడం మరో హైలైట్. ఐరా టీజర్ ఆద్యంతం ఎంతో గ్రిప్పింగ్ గా కనిపిస్తోంది. ట్రైలర్ లో సస్పెన్స్ థ్రిల్ మైమరిపిస్తోంది.  అమ్మాయిలపై పెరుగుతున్న ఆకృత్యాల్ని స్పర్శిస్తూ ఒక పల్లె వాతావరణంలో జరిగిన కథను ఎంచుకుని ఫ్లాష్ బ్యాక్స్ బ్యాక్ డ్రాప్ తో తీసిన సినిమా ఐరా.


ఈ సంగతిని తాజాగా రిలీజ్ చేసిన ఐరా టీజర్ చెప్పకనే చెబుతోంది. చూడబోతూంటే నయన్ కి ఈ మూవీ మరో మారు జాతీయ అవార్డ్ ని తెచ్చేట్టుగా కూడా ఉంది. ఈ నెల 25న వస్తున్న ఐరా ఔరా అనిపించక మానదని టీజర్ లెక్క చెబుతోంది. సో వైటింగ్ వర్ మూవీ.


మరింత సమాచారం తెలుసుకోండి: