హీరోయిన్స్ ఇప్పడూ బోల్డ్ గా కనిపించడానికి అస్సలు వెనుకాడటం లేదు. అందాలను ఆరబోస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అయితే కృతి సనన్ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం.. ఎందుకంటే ఈ సుందరి మహేష్ బాబు సినిమా '1 నేనొక్కడినే' ద్వారానే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కినేని నాగచైతన్య తో 'దోచేయ్' లో కూడా నటించింది.  కానీ విజయం దక్కలేదు.  బాలీవుడ్ లో మాత్రం ఫరవాలేదనిపించుకునే సినిమాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.


సినిమాలసంగతి ఇలా ఉంది గానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కాస్త స్పీడే.  ఇన్స్టాగ్రామ్ లో కృతి కి 16 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం ఈ భామ జోరును అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ భామ ఖాతాలో పలు బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్టులు ఉన్నాయి. తాజాగా ట్రైడెంట్ లిమిటెడ్ వారి లినెన్ టవల్స్.. బెడ్ షీట్లకు బ్రాండ్ అంబాజిడర్ గా ఎంపికయింది.  అసలే హాటు సుందరి పైగా తువ్వాళ్ళ ప్రమోషన్.. ఇంకేముంది.. ఒక టవల్ ఒంటికి మరొకటి తలకు చుట్టుకొని హాట్ ఫోటో షూట్ చేసింది. 

Image result for kriti sanon

 బాత్ టబ్ నుండి లేచి వస్తూ.. చిలిపిగా నవ్వుతూ ఒక పోజు ..  బాత్ టబ్ పై కూర్చొని మరో పోజు.. దుప్పటిని గట్టిగా ప్రియుడిని కౌగిలించుకున్నట్టు హత్తుకుని మరో పోజు.. ఇలా రచ్చ రచ్చగా రెచ్చిపోయింది.   హాటు బ్యూటీ కదా.. చీర కట్టుకున్నా.. చిరుగుల జీన్స్ వేసుకున్నా.. ఆఖరుకు టవలు చుట్టుకున్నా హాటుగానే ఉంటుంది. అంతే.. మరో మాటలేదు! అన్నట్టు ఈ  బ్యూటీ సుశాంత్ సింగ్ తో ప్రేమలో ఉందని కొద్దినెలల క్రితం పుకార్లు షికారు చేశాయి గానీ ఈమధ్య ఇద్దరూ పెద్దగా కలిసి తిరగడం లేదు. ఏమైందో..!  

మరింత సమాచారం తెలుసుకోండి: