ఒక సామాన్య కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ రాఘవ..నటుడిగా..దర్శకుడిగా మారారు.  అయితే నటుడిగా తాను నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో స్వియ దర్శకత్వంలో స్టైల్ సినిమా తీశాడు.  ఈ సినిమాలో ప్రభుదేవ ముఖ్యపాత్రలో కనిపించడమే కాదు క్లయిమాక్స్ లో స్టార్ హీరోలు నాగార్జున, చిరంజీవి కనిపిస్తారు.  ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో ‘ముని’సినిమా తీశాడు.  ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో ఘనవిజయం సాధించింది. దాంతో ఇదే కాన్సెప్ట్ తో కాంచన, గంగా సినిమాలు తీసి తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలు అందుకున్నారు. 
Image result for కాంచన 3 ఫస్ట్ లుక్
ఇప్పుడు కాంచన 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.   లారెన్స్ దర్శకత్వంలో కాంచ‌న 3.. ముని సిరీస్‌లో నాలుగో సినిమా తెర‌కెక్కుతున్న‌ది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది..ఈ సంద‌ర్భంగా లారెన్స్‌, నిక్కీ తంబోలీ, వేదిక స‌మ‌క్షంలో చిత్ర యూనిట్ కేక్ క‌ట్ చేసింది.  ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని లారెన్స్ ని చూడబోతున్నారని..గ్రాఫిక్స్ కి కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
Image result for కాంచన 3 ఫస్ట్ లుక్
అయితే ఈసారి రాఘవ ఏ రేంజ్ లో భయపెట్టి నవ్వించబోతున్నాడో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రుద్రాక్షలు ధరించిన మధ్య వయస్కుడిగా, స్టైల్ గా లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేదిగా ఉంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. క‌బీర్ దుహ‌న్ ఈ సినిమాలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించనున్నాడు. ఈ సినిమాకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: