టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోసిన నటులు నందమూరి తారక రామారావు.   సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో ఆయన నటించిన పాత్రలు చలన చిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.  ఎలాంటి పాత్ర అయినా ఎన్టీఆర్ నటిస్తే..ఆ పాత్రకే అందం వస్తుందని అనేవారు.  ఇక ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోదనుడు, రావణ బ్రహ్మ పాత్రలే కాకుండా నర్తనశాలలో బృహన్నల పాత్ర లో నటించి అందరినీ ఆశ్చర్య పరిచారు.  టాప్ హీరోగా ఉన్న సమయంలో బృహన్నల పాత్రలో నటించి మెప్పించగలరా అన్న అనుమానాలు వచ్చినా..ఆ పాత్రకు ఎన్టీఆర్ జీవం పోయడంతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు.
Image result for ntr biopic
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తన తండ్రి నటించిన ఎన్నో పాత్రల్లో నటించి అందరినీ అబ్బుర పరిచారు. అందులో  నర్తనశాలలో బృహన్నల పాత్ర బాలకృష్ణ బాగా నటించారు.  అయితే ఈ మద్య సోషల్ మీడియాలో మంచీ..చెడూ ఇట్టే వైరల్ అవుతున్నాయి.  ముఖ్యంగా సినిమాల గురించి సోషల్ మీడియాలో రక రకాల ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 
Image result for ntr biopic
ఎన్టీఆర్ కథానాయకడు లో బాలకృష్ణ..బృహన్నల పాత్రలో నటించడంపై అభిమానులకు కాస్త కష్టంగానే అనిపించింది కానీ సినిమా బాగుండడంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమాను విమర్శించాలని అనుకునే వారికి మాత్రం మంచి పాయింట్ దొరికింది.  బాలయ్య గెటప్ తో మీమ్స్ డిజైన్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.అంతే కాదు మహానటి సావిత్రి సినిమాతో ఎన్టీఆర్ బయోపిక్ ని పోలుస్తూ ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: