ఏ రంగంలోనైనా  ఎదగాలాంటే ఎంతో మంది దీవెనలు కావాలి. ఇక కొన్ని రంగాలు తీసుకుంటే ప్రజల ఆదరణ చాలా ముఖ్యం. వారి ప్రమేయం లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు. ఒకరిని ఉన్నతంగా నిలబెట్టిన జనమే నచ్చకపోతే దించేస్తారు. అందువల్ల ఆయా రంగాల వారు నిరంతరం జనాలకు అనుగుణంగా తమ అడుగులు, ఆలొచనలు ఉండేలా చూసుకోవాలి.


ఒకే ఒక్క వినోదం కాదు :


ఇక సినిమా రంగం విషయానికి వస్తే అదిపుడు ఒకే ఒక్క వినోదం మాత్రం కాదు. ఎంటీయార్, ఏయన్నార్ రోజుల్లో సినిమా పవర్ ఫుల్ సాధనం. ఆ తరువాత కూడా అది కొనసాగినా మారుతున్న కాలంతో పాటుగా చూసుకుంటే ఇపుడు సినిమా ఏకైక వినోదం కాదు. చేత్తో  స్మార్ట్ ఫోన్ ప్రతీ వారికి ఉన్న ఈ రోజుల్లో అతన్ని ధియేటర్ వద్దకు తీసుకెళ్ళడం అంటే కష్ట సాధ్యమైన విషయం. దాంతో సినిమాల్లో హిట్లు బాగా తగ్గిపోయాయి. ఏడాదితో ఎన్ని సినిమాలు వచ్చినా గట్టిగా నాలుగు సినిమాలు హిట్ కావడం గగనంగా మారుతోంది. ఈ నేపధ్యంలో పెద్ద పండుగలు, సెలవుల్లో మాత్రమే థియేటర్లు కాసింత కళ కడుతున్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన సంగతే అయినా సినిమా వారు కొంతమంది  డెమీ  గాడ్స్ లా బిహేవ్ చేయడంతో పాటు ఇగోలు, విభేదాలు వంటివి చొరబడి ఆ పండుగ వేళ కూడా పస్తులు తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.


ఇక ఒక సినిమా బాగుంటే చూడాలని ప్రేక్షకుడు అనుకుంటాడు. అయితే నెగిటివ్ ప్రచారంతో అతన్ని సినిమా హాలు వద్దకు వెళ్ళనీయకుండా చేస్తున్నవ్యవహారం  ఇపుడు సినిమా రంగంలో  విషాన్ని చిమ్ముతోంది. మా సినిమావే ఆడాలి. మాకే రికార్డులు ఉండాలి అనుకునే కొంత మంది మోతుబరుల కారణంగానే ఈ పరిస్తితి ఎదురవుతోందని అంటున్నారు.  పని గట్టుకుని కొత్త సినిమాలకు నెగిటివ్ ప్రచారం చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది.


దాని వల్ల ఆ సినిమాలు ఫట్ మంటున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. ఆ తరువాత దెబ్బ తిన్న వారు  రేపు ఇదే హీరోల సినిమాలకు తమ వంతుగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దాంతో ఈ సినిమాలూ అంతే సంగతులు అవుతున్నాయి. అంటే నీవు నేర్పిన విద్యలే నీరజాక్ష అంటూ ఒకరిని మించి ఒకరు విష ప్రచారం చేసుకోవడం వల్ల అసలు సినిమాకే ఎసరు వస్తోంది. 
అసలే హిట్లు లేక అల్లాడుతున్న సినిమా రంగానికి ఈ జాడ్యం ఇపుడు కట్టి కుదుపుతోంది. దీనివల్ల నాలుగు కాసులు వచ్చేది కూడా రాకుండా పోతోంది. ఇది ఉన్న చెట్టు కొమ్మను నరుక్కోవడంలాగానే ఉందని అంటున్నారు. ఎవరైతే ఈ రోజు ఇదే పరిశ్రమను నమ్ముకుని స్టార్లు, సూపర్ స్టార్లు అయ్యారో వారి సినిమాలకు ఇదే గతి పడుతోంది. అంటే ప్రజలను విస్మరించి తామే రారాజులమని ఎవరైతే భ్రమల్లో ఉంటారో వారంతా ఇపుడు ఈ నెగిటివ్ బారిన తామూ పడిపోతున్నారు.


నిజానికి సినిమాకు అసలైన హీరో నిర్మాత. అతనికి కళ్ళ ముందు ఒక్క నమ్మకం తప్ప ఏమీ కనబడదు, దర్కకుడి కధను నమ్మి, హీరో ప్రతిభ చూసి, వారికి జనంలో ఉన్న పేరు చూసి సినిమా తీస్తాడు, ఆ తరువాత బయ్యర్లు ఆ సినిమాను  భారీ రేటు పెట్టి కొంటారు. ఇక ధియేటర్ల వారు కూడా ఫ్యాన్సీ ఆఫర్లకు తీసుకుంటేనే  బొమ్మ పడేది. ఆ మీదట జనాదరణ తోడు అయితే సినిమా హిట్ అవుతుంది. 
ఇందులో మేమే కింగులం అని ఏ హీరో అనుకున్న పొరబాటే. ఇక సినిమా విడుదలకు ముందు తీరి కూర్చుని విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం ద్వారా తమ అభిమానులను రెచ్చగొట్టి ఉన్న వాతావరణాన్ని పాడుచేసుకోవడం వల్ల చివరికి పరిశ్రమకే నష్టం అన్న సంగతి అంతా గుర్తించాలి. సినిమా రంగంలో ప్రతి ఒక్కరూ కష్టపడాలి. అందరికీ అన్నం దొరకాలి. కానీ పందెం కోళ్ళ మాదిరిగా, రాజకీయ కామెంట్స్ చేసుకుంటూ సమయం కాని సమయంలో రెచ్చిపోవడం వల్ల లాస్ అయ్యేది మొత్తానికి మొత్తం సినిమా పరిశ్రమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: