బిగ్ బాస్ 2 విజేత కౌశల్ హీరోగా మారుతున్నారు. ఆయన కధానాయకుడిగా త్వరలో ఓ సినిమాను తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కౌశల్ గతంలో టీవీ సీరియల్స్ తో పాటు, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషింఛారు. ఆయన బిగ్ బాస్ 2 లో ఉన్నన్నాళ్ళు ఆయన పేరిట కౌశల్ ఆర్మీ ఏర్పాటు అయి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 


ఇదిలా ఉండగా ఓ యువ దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో, హీరోగా చేయడానికి కౌశల్ అంగీకరించినట్టుగా సమాచారం. ఈ సినిమాను నిర్మించడానికి ఒక నిర్మాత సిద్ధంగా ఉన్నాడనీ, ఆయనకి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి 'సేనాని' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. 


త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. సమకాలీన రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాత్ర ఆధారంగా ఈ సినిమా కొనసాగుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: