బోయపాటి శ్రీను దర్శ‌కత్వం అనగానే నరుకుళ్ళు, చంపుళ్ళు అన్న బ్రాండ్ ఫిక్స్ అయిపోయింది. భద్ర సినిమా మొదలుకుని ఈ రొజు వచ్చిన వినయ విధేయ రామ వరకూ ఆయన ఒకే లైన్ ని నమ్ముకున్నారు. కొన్ని సార్లు అది క్లిక్ అయినా చాలా సార్లు పల్టీ కొట్టింది. అయినా ఈ ఊర మాస్ డైరెక్టర్ తన రూట్ అదేనంటున్నారు. వినయ విధేయ రామ మూవీకి మిక్సుడ్ టాక్ రావడంతో బోయపాటి నెక్స్ట్ చేయబోయే మూవీ ఏంటన్నది చర్చగా ఉంది.


బాలయ్యతో ఉంటుందా :


ఇక బోయపాటి తన తరువాత సినిమా బాలయ్యతో  అని ఎంటీయర్ ప్రె రిలీజ్ ఫంక్షన్లో ప్రకటించి ఉన్నారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ అని కూడా చెప్పేశారు. ఇపుడు వీవీయార్ ఫలితం తేడాగా ఉండడంతో బాలయ్యతో మూవీ ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. సిమ్హా,  లెజెండ్ వంటి మూవీస్ ని బాలయ్యకు అందించి బోయపాటి తన మార్క్ ని మరింతగా  స్పష్టం చేసుకున్నాడు. ఆ సినిమాలు బాలయ్య, బోయపాటి కాంబోపై ఆశలను కూడా బాగా పెంచేశాయి కూడా. దాంతోనే హ్యాట్రిక్ మూవీగా ఇపుడు అనౌన్స్ చేశారు. అయితే దీనిపై ఇపుడు మరింత క్లారిటీ రావాలంటున్నారు.


మహేష్ తో  మూవీ :


ఇక బోయపాటి మరో కమిట్మెంట్ కూడా ఇపుడు టాపిక్ గా ఉంది అది సూపర్ స్టార్ మహేష్ తో చేయాల్సిన మూవీ. అసలే వీవీఆర్‌ ఎఫెక్ట్‌తో ఉన్న బోయపాటికి మహేష్‌ చాన్స్‌ ఇస్తాడా? వీరి చిత్రం రావడానికి అవకాశాలు ఉన్నాయా? కానీ బోయపాటి మహేష్‌తో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 


హీరోయిజం అంటే :


ఇక బోయపాటి మూవీస్ లో హీరోయిజం అంటే నరుకుడు, చంపుడు అన్నట్లుగా చూపించడం పట్ల విమర్శలు ఉన్నాయి. యాక్షన్ సినిమాకు కావాలి. ఓవరాక్షన్ అవసరం ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బాలయ్య లాంటి హీరో తో చేసిన స్టోరీలనే అటు ఇటూ తిప్పేసి యూత్ హీరోలతో చేయిస్తే అవి విఫల ప్రయోగాలే అవుతాయి తప్ప సక్సెస్ రాదు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏమైన బోయపాటి లో మంచి డైరెక్టర్ ఉన్నారు, ఆయన మూస ధోరణి విడిచిపెట్టి కధ మీద ద్రుష్టి పెడితే ఊర మాస్ బిరుదు నుంచి  మారి మంచి దర్శకుడి ముద్ర వస్తుందని అంటున్నారు. చూడాలి మరి



మరింత సమాచారం తెలుసుకోండి: