అసలే సంక్రాంతి ఆపైన సినిమాల హడావిడి ఈ వారం వచ్చిన మూడు తెలుగు సినిమాలు ఒక తమిళ సినిమా మొత్తం నాలుగు సినిమాల్లో నాలుగు అంతగ గొప్పగా ఏం లేకున్నా కథ విషయం పక్కన పెడితే వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2కి కాస్త మంచి టాక్ వచ్చిందని చెప్పొచ్చు.


ఎన్.టి.ఆర్ కథానాయకుడు బాగానే ఉంది. ఇక వినయ విధేయ రామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోయపాటి శ్రీను, రాం చరణ్ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోకుండా ఈ సినిమా ఉంది. ఇక సినిమాల సందడి ఇలా ఉంటే బుల్లితెర మీద కూడా హంగామా మొదలైంది. సంక్రాంతి 3 రోజులు సరికొత్త షోలతో సర్ ప్రైజ్ చేస్తున్నారు.


ఇక తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధమవుతుంది. ఈ సీజన్ లో అసలైతే ఎన్.టీఅర్ హోస్ట్ గా చేయాల్సి ఉన్నా రాజమౌళి వల్ల బిగ్ బాస్ చేయనని చెప్పాడని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 కి ఎన్.టి.ఆర్ రావాలంటే ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ కు ఇబ్బంది అవుతుంది. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ లో ఎన్.టి.ఆర్ లుక్ లీక్ అవకుండా ఉండాలని చూస్తున్నారు.


అందుకే ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా చేయకుండా రాజమౌళి అడ్డు పడుతున్నాడట. రాజమౌళి తన సినిమా అగ్రిమెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. బాహుబలి కోసం ప్రభాస్ ను 5 సంవత్సరాలు వెయిట్ చేయించిన విషయం తెలిసిందే. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 3 ఎన్.టి.ఆర్ దాదాపుగా హోస్ట్ గా చేసే అవకాశం లేదు. వెంకటేష్ పేరు వినపడుతున్నా ఆయన మాత్రం అదంతా రూమర్ అంటూ చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: