శివగామి గా రమ్యకృష్ణ కు దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చి పెట్టింది. బాహుబలి సిరీస్ తో రమ్యకృష్ణ పేరు శివగామి గా మారు మ్రోగి పోయింది. అయితే రమ్యకృష్ణ తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా ఉందని చెప్పాలి. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న సూపర్ డీలక్స్ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించే పాత్ర ఆసక్తికరంగా ఉంటుందనే సినీ వర్గాల వెల్లడిస్తున్నాయి.  

శృంగార తార పాత్రలో కూల్‌గా

సూపర్ డీలక్స్ మూవీలో రమ్యకృష్ణ గతంలో పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో భాగంగా మల్లు కట్ అనే సినిమాలో శృంగారతారగా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు లీలా. ఈ పాత్ర కోసం తొలుత నదియాను సంప్రదించాం. కొన్ని కారణాల వల్ల ఈ పాత్రలో నటించడానికి ముందుకు రాలేదు అని దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా వెల్లడించారు. నదియా రిజెక్ట్ చేశారనే విషయాన్ని పట్టించుకోలేదు.

చెన్నైలో 24 గంటల్లో జరిగే

ఎలాంటి సందేహాలు లేకుండా పోర్న్ స్టార్‌గా నటించేందుకు రమ్యకృష్ణ ముందుకు వచ్చారు. చాలా కూల్‌గా తన పాత్రలో ఒదిగిపోయారు. నటిగా తనకు ఉన్న ఇమేజ్‌ను పక్కన పెట్టి ఈ పాత్రలో నటించడం నిజంగా అభినందనీయం అని దర్శకుడు అన్నారు. సూపర్ డీలక్స్ చిత్రంలో హీరో విజయ్ సేతుపతి ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నారు. లింగమార్పిడి చేసుకొన్న మహిళగా విజయ్ సేతుపతి కనిపిస్తాడు. అలాగే ఈ చిత్రంలో సమంత, ఫహద్ ఫాజిల్ జంటగా నటిస్తున్నారు. మృతదేహాన్ని అమ్మడానికి తంటాలు పడే పాత్రల్లో నటించారు. చెన్నై నగరంలో 24 గంటల్లో జరిగే కథతో సూపర్ డీలక్స్ సినిమాను దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా తెరకెక్కిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: