సాధారణంగా సినిమాల్లో హీరో తన చుట్టు పక్కల ఉన్నవాళ్లకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు.  విలన్లతో పోరాడుతూ..తన వారి మంచి కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు..చివరికి విలన్లను అంతం చేసి కథ సుఖాంతం చేస్తుంటాడు.  అయితే ఇలాంటి హీరోలు రియల్ లైఫ్ లో కనిపించడం చాలా అరుదు.  అయితే వెండితెరపై ఓ చిన్న కొరియోగ్రాఫర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి నటుడిగా మారి చిన్న చిన్న పాత్రల నుంచి హీరో స్థాయికి ఎదిగాడు.  ఆ తర్వాత దర్శకత్వంలోకి అడుగు పెట్టి సూపర్ హిట్ సినిమాలు తీస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అతనే లారెన్స్ రాఘవ.

వెండితెరపై హీరోగానే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు లారెన్స్.  తనను కన్న తల్లికి ఏకంగా గుడి కట్టించి అందులో విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి పూజిస్తున్నాడు.  ఎంతో మంది అభాగ్యులను చేరదీసి ఆదుకుంటున్నారు.  ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ..వారికి అండదండగా ఉంటున్నారు.  ప్రకృతి వైపరిత్యాలు జరిగిన ప్రతి చోట తన ఫ్యాన్స్ ని పంపుతా బాధితులను ఆదుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. 
Image result for Raghava Lawrence helps old age
ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నలారెన్స్ చిన్నారిని పరిచయం చేస్తూ.. అతని పుట్టినరోజు సందర్భంగా దీవెనలు, విషెస్ అందించమని అభిమానులను కోరారు. హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్! ఈ చిన్నారి పేరు ఈశ్వర్. అతను ఒక సంవత్సరం క్రితం నా దగ్గరికి వచ్చాడు. నేడు తన పుట్టినరోజుని నాతో జరుపుకుంటున్నాడు. ఈశ్వర్‌కి మీ విషెస్, దీవెనలు అందించాలని కోరుతున్నాను’’ అని లారెన్స్ ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి రియల్ హీరోలు చాలా అరుదుగా ఉంటారు..వారి మంచి మనసుతో ఎంతో మంది అనాధలను..అభాగ్యులను ఆదుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: