రాజమౌళి సినిమా అంటే రిలీజ్ కాకముందే రికార్డులు బద్దలు కొట్టడం సహజం. అయితే బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడం తో ఈ సారి రికార్డు మాములుగా లేదు . #RRR రెండో షెడ్యూల్ ఈమధ్యేనే ప్రారంభం అయింది. సినిమా రిలీజ్ కు ఇంకా ఏడాదిపైనే సమయం ఉంది కానీ రికార్డులు సృష్టించదానికి ఇవేమీ అడ్డంకి కాదు కదా? తాజా సమాచారం ప్రకారం #RRR శాటిలైట్.. డిజిటల్ రైట్స్ విషయంలో ఒక భారీ రికార్డ్ సృష్టించింది.

Image result for rajamouli ntr ram charan

దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఒక ఛానల్ అన్నీ భాషలకు కలిపి #RRR శాటిలైట్.. డిజిటల్ రైట్స్ కోసం రూ.132 కోట్లు ఆఫర్ చేసిమరీ దక్కించుకుందట. సౌత్ సినిమాలవరకూ ఇది బిగ్గెస్ట్ డీల్ అని సమాచారం.  గతంలో ఈ రికార్డు శంకర్ -రజనీకాంత్ చిత్రం '2.0' పేరిట ఉండేది.  '2.0' శాటిలైట్.. డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రూ. 108 కోట్లకు అమ్ముడయ్యాయి. 

Image result for rajamouli ntr ram charan

దీన్ని బట్టి రాజమౌళి చిత్రానికి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రెండు మూడు నెలల్లోపే దాదాపు 40% పైగా బడ్జెట్ ను రికవర్ చేయడం సాధారణమైన విషయం కాదు. ఈ లెక్కన టీజర్.. ట్రైలర్ లు విడుదలయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశాన్ని తాకడం ఖాయం.  



మరింత సమాచారం తెలుసుకోండి: