టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో హీరోగా రవితేజ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.  సిటీకి ఎంతో మంది కమీషనర్లు వస్తుంటారు..పోతుంటారు..చంటిగాడు లోకల్..డైలాగ్.  కమీషనర్ కూతుళ్లకు పెళ్లిళ్లు కావా..వారు పెళ్లి చేసుకోరా అంటూ మాస్ డైలాగ్స్ తో రవితేజ ఒక్కసార్ స్టార్ హీరో హాదాకి ఎదిగాడు.  ఆ తర్వాత వరుస విజయాలు సాధించి మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్నాడు.  అయితే బెంగాల్ టైగర్ తర్వాత ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉన్నాడు రవితేజ. 
Related image
అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరోసారి తన మాస్ పవర్ ఏంటో చూపించి అబ్బో అనిపించాడు.  కానీ తర్వాత వచ్చిన  'టచ్ చేసి చూడు'.. 'నేల టికెట్' .. 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలు వరుస పరాజయాలను అందుకున్నాయి.  అసలే యంగ్ హీరోల తాకిడి..పైగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ తన పారితోషికాన్ని తగ్గించుకోడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటూ వుంటారు.
Image result for raviteja
ఆ మధ్య కూడా రవితేజ తన పారితోషికం విషయంలో మెట్టుదిగి రాకపోవడంతో రెండు మూడు ప్రాజెక్టులు ఆగిపోయిన విషయం తెలిసిందే.  ఇటీవల విడుదలై ఫ్లాపులైన సినిమాల ప్రభావం తీవ్రంగా ఉండటంతో కెరీర్ కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉండటంతో పారితోషికం తగ్గించుకోమన్నారట. మొదట ససేమిరా అన్న రవితేజ .. ఆ తరువాత అందుకు అంగీరించాడని టాక్. ఇక రవితేజ పుట్టినరోజు సందర్భంగా రేపు ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ రానుందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: