టాలీవుడ్ లో పాత తరం నటీ, నటులలో జమున, సత్యనారాయణ లాంటి అతి కొద్ది మందే జీవించి ఉన్నారు.  ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో సత్యనారాయణ కనిపించిన విషయం తెలిసిందే. పలు సినీ వేడుకల్లో నటి జమున హాజరవుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలనాటి అందాల తార జమున మాట్లాడుతూ..దివంగత నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు తనను మూడేళ్ల పాటు బాయ్‌కాట్ చేశారని పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Image result for ntr anr
ఆడవాళ్లు బయటకొచ్చి ఉద్యోగాలు, కానీ మరేదైనా చేస్తే.. మగవాడు సహించలేడని, వాళ్లకు బానిసల్లా ఉండాలనే కోరుకుంటారని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్ని స్త్రీ ఉద్యోగంలో గానీ.. ఇతర రంగాల్లో కానీ ఫేస్ చెయ్యక తప్పదు.  బాబు అంటూ దణ్ణం పెట్టించుకోవాలనే తత్వం చాలా మందిలో చాలా ఎక్కువగా ఉంటుందని పరోక్షంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లపై విరుచుకుపడింది.  తన వ్యక్తిత్వాన్ని సహించలేకే వారిద్దరూ తనను బాయ్‌కాట్ చేశారని ఆమె పరోక్షంగా వెల్లడించారు.

ఇలాంటి పరిస్థితులని స్త్రీలు ఉద్యోగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఎదుర్కోక తప్పదని, ఇవన్నీ ఎదుర్కోవడానికి స్త్రీలకు చాలా గుండె ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చారు.  అనంతరం ఆ ఇద్దరు హీరోలు లేకుండా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అని తెలిపారు. దాదాపు 18 నుండి 20 సినిమాలు చేశానని, అందులో 15 సినిమాలు హిట్ అంటూ గర్వంగా చెప్పారు.  ఆ ఇద్దరు హీరోలు లేకపోయినా జమున తో  తీస్తే తప్పకుండా హిట్ అవుతుందని  నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి  చూపేవారని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: