మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ ముగింపు దశకు వచ్చిందా అంటే అవుననే చెబుతున్నారు. శ్రీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన తమన్నా ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో హ్యాపీడేస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమా అవకాశాల కోసం దేనికైనా సిద్ధమని చెప్పింది.


ఇన్నాళ్ల కెరియర్ లో తమన్నా గ్లామర్ షోకి కాస్త దూరంగా ఉంటూ వస్తుంది. అయితే ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లడంతో ఇక అందుకు కూడా సిద్ధపడింది. అంతేకాదు ఛాన్సులు ఇవ్వరా అంటూ కనిపించిన డైరక్టర్ ని అడుగుతుందట. గ్లామర్ అడ్డు గోడలను ఎత్తేసిన తమన్నా ఇక నుండి తనలోని మరో యాంగిల్ చూపించేందుకు సై అంటుందట.


ఈమధ్య వచ్చిన ఎఫ్-2 సినిమా హిట్ అందుకున్న తమన్నా అనీల్ రావిపుడి, బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది ఓకే అయితే మరో హిట్ సినిమా ఆమె చేతిలో ఉన్నట్టే లెక్క. ఓ పక్క కెరియర్ ముగిసింది అనుకున్న కాజల్ కూడా మళ్లీ పుంజుకోగా తమన్నాకి మాత్రం ఆ ఛాన్స్ రావడం లేదు.


సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా తమన్నా నటిస్తుందని తెలుస్తుంది. అయితే అది ఎలాంటి పాత్ర అన్నది తెలియలేదు. ఇప్పటికే ఐటం సాంగ్స్ లో హాట్ హాట్ గా కనిపించే తమన్నా ఇక నుండి మరింత రెచ్చిపోతుందని తెలుస్తుంది. మరి గ్లామర్ డాల్ అందాల ప్రదర్శన ఆడియెన్స్ కు ఏమాత్రం కిక్ ఎక్కిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: