జీరోసైజు అందాలతో తెలుగుతెరను ఉర్రూతలూగించిన ఇలియానా పడిపోయింది, అదికూడా ఆమెను ఇంత స్థాయికి తెచ్చిన తెలుగుసినిమావాళ్లతో కాకుండా ఓ బాలీవుడ్ హీరోకు. అంతే కాదు ఈ దెబ్బకు ఇక తాను తెలుగు కాదుకదా.. సౌత్ ఇండియా సినిమాల్లోకే రాను అంటోంది.

చూసారా.. ఓసారి టేస్ట్ దొరికితే ఎలా ఉంటుందో, అంతేలెండి, పాత ఓ రోత, కొత్త ఓవింత అంటారు కదా..తాను బాలీవుడ్ లో స్టార్ అయిపోయిందట. ఇక సౌత్ సినిమాలు తీసేంత సమయమూ, తీరికా నాకు లేదంది. అంతటితో ఆగిందా.. త్వరలో తెరపైకి రాబోయే బాలీవుడ్ సినిమాలో హీరోతో తన కెమిస్ట్రీ అదిరిపోయింది అంటోంది. అంటే ఆహీర్ పర్ ఫార్మెన్స్ కు ఇలియానా పడిపోయిందన్న మాట.

ఈనెల 20 న ఇలియానా, షాహిద్ కపూర్ లు జంటగా నటించిన ‘పాత పోస్టర్ నిక్లా హీరో’ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ తో ఆక్షన్, రొమాన్స్,డ్రామా అదిరిపోయిందట. తనకు తెలుగు సినిమాల్లో ఎన్నో అవకాశాలు వస్తున్నా కూడా తనకు సమయం లేదని, ఇక రానని చెప్పిందట ఇలియానా...

 

మరింత సమాచారం తెలుసుకోండి: