గగన జఘన అంటారు అద్భుతమైన సౌందర్య రాశిని గురించి కవులు. అంటే నడుము ఉండీ ఉండనట్లుగా ఉంటే ఆ సొగసు కేక అన్నది కవి భావన. సిమ్హం నడుము అని కూడా పోలుస్తారు. మన హీరోయిన్లను కూడా దర్శకులు నడుము చూపించి రొమాంటిక్  ఫీల్ తెస్తారు. అలాంటి సీన్లలో నటించి కలల రాణులుగా అయిపోయిన వారు ఎందరో అందాల తారలు మనకు ఉన్నారు.


విషయానికి వస్తే శ్రద్ధా దాస్ అన్న సుందరి ఇపుడు తన నడుము, బొడ్డు అందాలను చూపిస్తూ ఓ రేంజిలో కిక్కెక్కిస్తోంది. తెలుగులో దాదాపుగా డజన్ వరకూ మూవీస్ చేసినా కూడా ఈ కుర్రదానికి తగినంత గుర్తింపు రాలేదు. బాలక్రిష్ణ వంటి స్టార్ తో ఐటెం సాంగ్ చేసింది. గోపీచంద్ తో హాట్ హాట్ గా పాటలు పాడింది. నరెష్ తోనూ రెచ్చిపోయే విధంగా ఫోజులు ఇచ్చి జంట కట్టింది. అయినా తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. ఇక లాభం లేదనుకుని బాలీవుడ్ కి వెళ్ళింది. . అక్కడ కూడా పెద్దగా రిజల్ట్ లేదు. దాంతో వెబ్ సీరియళ్ళ మీద పడింది.


అందులో ఓ సీరియల్లో ఫోజుని రీసెంట్ గా శ్రద్ధాదాస్ బయట పెట్టింది. నాభీ సౌందర్యంతో ఈ అమ్మడు కిర్రాకు తెప్పిచేన్సింది. ఈ సీరియల్లో మరెన్నో రొమాంటిక్  ఫోజులు, సీన్లు ఉంటాయంటున్నారు. ఇక ఇన్స్ట్రాగ్రాం లోనూ ఈ ముద్దు గుమ్మ తన హాటీ పిక్స్ ని ఎప్పటికపుడు పెడుతూ సెగలూ పొగలూ రేపుతోంది. మొత్తానికి మూవీస్ లో బ్రేక్ రాకపోవడానికి ఎన్నో కారణలు ఉన్నా ఈ చిన్న దాని అందానికి మాత్రం మంచి మార్కులే యూత్ వేసేస్తోంది. అందం, అభినయం అన్నీ ఉన్నా లక్కీ కాకపోవడమే శ్రద్ధకు సక్సెస్ లేకుండా చేస్తోందని అంటున్నారు. మరి ఈ ఫోజులతోనైనా ఆమెకు మరిన్ని చాన్సులు వస్తాయో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: