అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా మిస్టర్ మజ్ను. అఖిల్, హలో సినిమాల తర్వాత అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలని తీసిన ఈ సినిమా కథ, కథనాలు రొటీన్ గా ఉండటంతో ఆడియెన్స్ మళ్లీ ఈ సినిమాను తిప్పికొట్టారు. యూత్ ఆడియెన్స్ బాగుందని చెబుతున్నా మిగతా వారు మాత్రం సినిమా కష్టమే అంటున్నారు.


అయితే కలక్షన్స్ కూడా పెద్దగా హడావిడి చేయట్లేదు. మొదటి రోజు 3 కోట్ల లోపు డిస్ట్రిబ్యూషన్ షేర్ రాబట్టిన మిస్టర్ మజ్ ను రెండవరోజు మాత్రం రెండున్నర కోట్ల సుమారు వసూళ్లను రాబట్టింది. రెండు రోజుల్లో మిస్టర్ మజ్ ను తెలుగు రెండు రాష్ట్రాల్లో 5.58 షేర్ కలెక్ట్ చేసింది. 22.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన మిస్టర్ మజ్ను రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 7 కోట్ల వరకు రాబట్టాడు.


సినిమా కథలో దమ్ము లేకపోవడం.. కథనం కూడా సెకండ్ హాఫ్ మరీ రొటీన్ గా నడిపించడం మిస్టర్ మజ్ను కి దెబ్బ వేశాయి. తమన్ మ్యూజిక్ కొద్దిమేరకు కాపాడినా ఫైనల్ గా డిఫరెంట్ సినిమాలను ఆశించే ప్రేక్షకులకు అఖిల్ మళ్లీ నిరాశపరచాడు. అక్కినేని ఫ్యాన్స్, యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చేసినా వారి వల్ల పెద్దగా వసూళ్లు రావట్లేదు.


ఏరియాల వారిగా మిస్టర్ మజ్ను వసూళ్ల వివరాలు..


నైజాం : 2.02 కోట్లు 
సీడెడ్ : 0.81 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.73 కోట్లు
ఈస్ట్ : 1.50 కోట్లు
వెస్ట్ : 1.25 కోట్లు
కృష్ణా :1.35 కోట్లు
గుంటూరు : 1.50 కోట్లు
నెల్లఊరు : 0.65 కోట్లు
తెలుగు రెండు రాష్ట్రాల మొత్తం : 5.58 కోట్లు 


మరింత సమాచారం తెలుసుకోండి: