అక్కినేని యువ హీరో అఖిల్ మూడవ సినిమాగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా మిస్టర్ మజ్ను. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే యూత్ ఆడియెన్స్ మాత్రం ఈ సినిమా సూపర్ అనేస్తున్నారు. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.


లాస్ట్ ఇయర్ సవ్యసాచి సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన నిధి అగర్వాల్ అక్కినేని నాగ చైతన్య సరసన మొదటి సినిమా చేయగా ఇప్పుడు అఖిల్ తో రెండో సినిమాలో నటించింది. సినిమాలో ఆమె కొన్ని సీన్స్ లో డీ గ్లామరస్ గా కనిపించింది. అయితే మిస్టర్ మజ్నులో ప్లే బోయ్ రోల్ చేసిన అఖిల్ ఫ్లైట్ లో ఓ అమ్మాయిని కలుస్తాడు.


ఆమె ఓ రెండు మూడు సీన్స్ లో కనిపిస్తుంది. ఆమె వచ్చినప్పుడు స్క్రీన్ స్పేస్ అంతా ఆమె ఆక్యుపై చేసినట్టు ఉంటుంది. అఖిల్ పక్కన్న ఆ గ్లామర్ డాల్ అదరగొట్టింది. కచ్చితంగా చెప్పాలంటే హీరోయిన్ నిధి అగర్వాల్ కన్నా ఆమె కాస్త ఎక్కువ గ్లామర్ లుక్ లో కనిపించింది. సినిమా ఎండ్ సీన్ లో కూడా ఆమె కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా ఆ అమ్మడు అంటే మోడల్ కమ్ హీరోయిన్ నజియా డెవిసన్.


బాలీవుడ్ లో అప్కమింగ్ హీరోయిన్ అయిన నజియా 'గర్ల్ ఇన్ రెడ్' షార్ట్ ఫిల్మ్ లో నటించి మెప్పించింది. ఇక అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడికి మిస్టర్ మజ్నులో ఛాన్స్ వచ్చింది. హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ అమ్మడు మిస్టర్ మజ్నులో చిన్న రోల్ తో సరిపెట్టుకుంది. సినిమా చూసిన ఆడియెన్స్ ను హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటుగా నిజియా డెవిసన్ కూడా మెప్పించింది. అంతేకాదు ఆమె ఇన్ స్టాగ్రాం పిక్స్ చూస్తే అమ్మడు కూడా తక్కువదేమ్ కాదు బికినిలతో అదరగొట్టేస్తుంది. సో త్వరలోనే లీడ్ హీరోయిన్ గా చాన్స్ లు రావడం పక్కా అని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: