టాలీవుడ్ సీనియర్లలో ఒకరైన బాలయ్యకు తనకంటూ ప్రత్యేకత ఉంది. తనదైన మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ తో ఆయన మాస్ హీరో గా రాణిస్తున్నారు. దూకుడుగా డెసిషన్స్ తీసుకోవడం, వేగంగా సినిమాలు చేయడం బాలయ్యకు అలవాటు. గతంలో ఆయన చేసిన ప్రయోగాలు ఒక ఎత్తు. తాజా ప్రయోగం ఒక ఎత్తు.


అందుకే బాలయ్య ఇపుడు తల్లడిల్లుతున్నారు. ఎంతో ఆశతో ఆయన  చేసిన తన తండ్రి జీవిత కధ  ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రిలీజ్ కావ‌డం.. డిజాస్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. దాంతో బాలయ్య ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారుట. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని, రికార్డులు క్రియేట్ చేస్తుందని అనుకుంటే ఇలా బొక్క బోర్లా పడడంతో బాలయ్య రెండవ భాగం ఎన్టీఆర్ మహా నాయ‌కుడు మూవీ విషయంలో ఇరకాటంలో పడ్డారని టాక్. 


నిజానికి రెండు సినిమాల షూటింగ్ ఇంచుమించుగా ఒకే మారు పూర్తి అయిపోయింది. ఈ రెండు మూవీస్ ని మొదట అనుకున్నది జనవరి 9, 24 తేదీల్లో విడుదల చేయాలని. అయితే తరువాత మహానాయకుడు సినిమా ని ఫిబ్రవరి 7 కి వాయిదా వేశారు. కధానాయకుడు ఫ్లాప్ తరువాత 14కి వాయిదా పడింది. ఇపుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే ఆ మూవీ మళ్ళీ వాయిదా పడిందని అంటున్నారు.
నిజానికి ఆ మూవీని ఇప్పట్లో విడుదల చేస్తారో లేదోనని డౌట్స్ వస్తున్నాయి.


ఎందుకంటే ఈ రెండవ పార్ట్ అంతా పెద్దగా మలుపులు లేని విషయం ఉందంటున్నారు. పైగా బసవతారకం చనిపోవడం వరకే మూవీ ఉంటుందని కూడా చెబుతున్నారు. అంటే చంద్రబాబు వెన్నుపోటు వంటి సీన్లు ఉండవన్నమాట. దాంతో ఈ మూవీ ఇప్పట్లో బయటకు రాదా అన్న అనుమానాలు వస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో


మరింత సమాచారం తెలుసుకోండి: