పాప్ ప్రపంప‌చానికి రారాజు మెఖైల్‌జాక్సన్‌. ఈ పేరు వింటేనే పాప‌ర్స్‌,రాప‌ర్స్‌,డాన్సర్స్ ఇలా ఎవ‌రైనా మెఖెల్ మ‌త్తులో మున‌గాల్సిందే. మెఖైల్‌జాక్సన్ రూపొందించిన ఆల్బమ్స్ వింటువంటే సాధార‌ణ మ‌నిషి కూడ అత‌నికి అభిమానిగా మారిపోతాడు. ముఖ్యంగా మెఖెల్ జాక్సన్ రిలీజ్‌చేసిన థ్రిల్లర్ ఆల్భమ్ అనేది ఇప్పటికి సంగీత ప్రపంచంలో అంద‌రిని అమితంగా ఆక‌ర్షించిస్తున్న ఆల్బమ్‌. న‌వంబ‌ర్ 30, 1982న రిలీజ్ అయిన ఈ ఆల్బమ్ ఆనాటి నుండి నేటి వ‌ర‌కూ అత్యధిక ఆధ‌ర‌ణ పొందిన ఆల్భమ్‌. ప్రతి సంవ‌త్సరం గూగుల్ నిర్వహించిన స‌ర్వే ప్రకారం మొద‌టి మూజిక్ ఆల్బమ్స్‌లో ఇప్పటి వ‌ర‌కూ థ్రిల్లర్ ఆల్బమ్‌ను బీట్ చేసిన మ‌రోక‌టి లేదు. ప్రతి సంవ‌త్సరం ఎన్నో ఆల్బమ్స్ మార్కెట్లోకి వ‌స్తుంటాయి. ఎన్ని వ‌చ్చిన మైఖెల్ సృష్టించిన థ్రిల్లర్ ఆల్బమ్ ముందు చిన్నవే. 

అయితే ఇంత‌టి రికార్డును మొట్టమొద‌టి సారిగా బ్రేక్ చేసిన ఒక ఆల్బమ్ నేడు సంచ‌ల‌న‌మైంది. అదే గంగ్నమ్ స్టైల్‌. సౌత్ కొరియ‌న్ రాప‌ర్ సై రూపొందించిన గంగ్నమ్ స్టైల్ ఆల్బమ్ మైకెల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బమ్ కంటే ఎక్కువ ఆధ‌ర‌ణ‌ని సంపాందించింది. ఈ సంవ‌త్సరం గూగుల్ మూజిక‌ల్ స‌ర్వే ప్రకారం గంగ్నమ్ ఆల్బమ్‌కు 8.3 ప‌ర్సెంటేజ్‌ను ఇచ్చారు సంగీత ప్రియులు. థ్రిల్లర్ ఆల్బమ్‌కు 7.1 ప‌ర్సెన్‌టెజ్‌ను ఇచ్చారు. దీంతో ఆ రాప‌ర్ సై ఆనందానికి అంతే లేకుండా ఉంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న సంగీత‌ ప్రియులు కూడ ఇది నిజ‌మా అన్నట్టు ఆశ్ఛర్యప‌డుతున్నారు. పాప్ ప్రపంచ‌పు రారాజు మెఖెల్‌జాక్సన్ ఆల్భమ్‌ను బీట్ చేయ‌ట‌మంటే సామాన్య విష‌య‌మా. ఈ ఘ‌న‌త‌ను సాధించినందుకు గంగ్నమ్ రాప‌ర్ సై కు అంద‌రూ అభినంద‌న‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: