టాలీవుడ్ లో కామెడీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’సినిమాతో మంచి విజయం అందుకున్న నాని వరుసగా ఆరు సినిమాలతో హిట్స్ అందుకున్నాడు.  ఆ మద్య నాని ద్విపాత్రాభినయంలో నటించిన ‘కృష్ణార్జునల యుద్దం’కాస్త నిరాశపరిచింది.  ఇటీవల నాగార్జున, నాని కాంబినేషన్ లో వచ్చిన ‘దేవదాస్’కూడా యావరేజ్ టాక్ వచ్చింది.  ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’సినిమాలో నటిస్తున్నాడు నాని.  ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది.  లేటు వయసులో క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టిన ఓ యువకుడు ఎలా రాణించగలిగాడు.. అన్న కథాంశంతో ఆ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో  యు టర్న్ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది .
Image result for nani jersey
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో హీరో నానికి ముక్కుకు గాయం అయ్యాయి.  కాకపోతే స్వల్ప గాయం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  జెర్సీ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. 
Image result for nani jersey
ఈ నేపథ్యంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని ముక్కు కి గాయం కావడంతో అందరూ కంగారు పడ్డారు అయితే అది చిన్న గాయం మాత్రమే కావడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడట నాని.  గతంలో షూటింగ్ ముగించుకొని ఇంటికి బయలు దేరిన నానికి మద్యలో చిన్న ప్రమాదం జరిగిన సమయంలో కూడా ముక్కుకే గాయం అయినట్లు వార్తలు వచ్చాయి. వరుసగా రెండు పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నాని జెర్సీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: