వెంకీ మామ అంటే విక్డరీ  వెంకటేష్. నాగ చైతన్యకు అచ్చమైన మేనమామ. ఈ ఇద్ద‌రూ కలసి చేస్తున్న మూవీ పేరే అది. ఇక వెంకటేష్ ఈమధ్యనే సంక్రాంతికి ఎఫ్ 2 పేరు మీద భారీ హిట్ కొట్టి మంచి వూపు మీద ఉన్నాడు. చైతూతో కలసి వెంకీ మామ గా కుమ్మేయాలనుకుంటున్నాడు. ఈ మూవీలోనూ వినోదమే ప్రధానంగా ఉండేలా చూసుకుంటున్నారు.


ఎఫ్ 2 భారీ హిట్  ప్రభావం వెంకీ మామ మీద చాలా పడుతోందట. నాన్ స్టాప్ కామెడీ లేకపోతే ఈ మూవీ మీద అంచనాలు తగ్గిపోతాయని  కధను సైతం మార్పులు చేసుకుంటూ ఎఫ్ 2 లా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా చూసుకుంటున్నారు. ఇక యంగ్ హీరోలతో వెంకీ కాంబో ఎపుడూ కొత్తగానే ఉంటుంది. వారితో కలసిపోయి యాక్ట్ చేసే తీరు స్క్రీన్ మీద బాగా పండుతుంది. ఇపుడు ఏకంగా మేనల్లుడే పక్కన ఉన్నాడు. దాంతో వెంకీ మామ రెచ్చిపోతాడని, కామెడీతో ఫుల్ కిక్కు ఇస్తాడని అంటున్నారు. 


ఇక చైతూ పక్కన జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేశారని టాక్. వెంకీ పక్కనే మొదట నయనతార అనుకున్నారు. కానీ ఇపుడు శ్రియను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ఈ మూవీని ఫుల్ ఎనెర్జీతో తెరకెక్కించేందుకు యూనిట్ మొత్తం రెడీ అవుతోంది. అన్నీ కుదిరితే మాత్రం వెంకీ మామ మరో ఎఫ్ 2 అవుతుందని అంటున్నారు. చూడాలి మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: