సినీ హాస్యనటుడిగా ఆలీ మార్క్ కామెడీ ఎపుడూ నవ్విస్తుంది. ఇక ఆయన యాంకర్ గా చేసే షోలలోనూ నవ్వులు పూయిస్తారు. ఇపుడు రాజకీయాల్లోకి ఆలీ వస్తున్నారు. అక్కడ కూడా ఆయన ఎటువంటి సీరియస్ వ్యవహారం లేకుండా కుండబద్దలు కొడుతున్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్నారు. నిజంగా ఆలీ ఇలా చెప్పడం గ్రేట్ అనుకోవాలి.


నాకు మంత్రి పదవి చేపట్టాలని ఉంది అని ఆలీ చాలా బోల్డ్ గా తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. తనకు ఎవరు మంత్రి పదవి ఆఫర్ చేస్తే వారి పార్టీలో చేరుతానని తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో ఆలీ చెప్పడం విశేషం. నిజంగా ఆలీ గట్స్ కి హాట్సాఫ్ అని చెప్పాలిక్కడ. ప్రతీ వారి మనసులోనూ ఉండేది పదవీ కాంక్షే దానికి సిద్దంతాలు, తోట కూర అంటూ కబుర్లు చేర్చి  బాగా చెబుతారు. కానీ ఆలీ మాత్రం తాను చెప్పాల్సింది చెప్పేసి ఆఫర్ ఇవ్వాలంటూ ఓపెన్ గానే పార్టీలకు సవాల్ చేస్తున్నారు.


నాకు ఎవరు మినిష్టర్ ఆఫర్  ఇస్తారో వారి పార్టీలోనే చేరుతాను. అలా ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు ఇదీ ఆలీ లేటెస్ట్ ఆఫర్. ఈ మధ్యనే వరసగా జగన్, పవన్, చంద్రబాబులను కలసిన ఆలీ అన్ని పార్టీలకు ఇపుడు ఒకే ఆఫర్ తో గేలం వేశారు. మరి ఆలీని తీసుకోవడానికి రేసులో ఎవరు ముందుకు వస్తారో చూడాలి. అన్నట్లు పవన్ బాగా సన్నిహితుడైనా ఆలీని ఎపుడు తన పార్టీలో చేరమని అడగలేదుట. ఈ సంగతీ ఆలీయే చెప్పారు. ఇక చూడాలి ఆలీ పొలిటికల్ ఎంట్రీ ఏ పార్టీతో ఉంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: