నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సిఎం కుర్చి ఎక్కితే ఎలా ఉంటుంది. అబ్బో బాబు అంత తేలిగ్గా సిఎం సీటు ఇచ్చేస్తాడా అని ఆశ్చర్యపోవచ్చు. నిజంగానే బాలయ్య ముఖ్యమంత్రి అవుతున్నాడు కాని అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో అని తెలుస్తుంది.


ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ నిరాశపరచడంతో సెకండ్ పార్ట్ ఎలాగైనా ఆడియెన్స్ ను మెప్పించేలా ఉండేందుకు క్రిష్ అండ్ టీం తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఆ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.


అంతేకాదు సినిమాలో బాలకృష్ణ సిఎంగా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తారట. ఒక పాత్ర ముఖ్యమంత్రిగా కనిపిస్తుందట.. ఇంకో రోల్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. బోయపాటి శ్రీను రాం చరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ ఫ్లాప్ అవగా బాలకృష్ణ సినిమాతో బోయపాటి మళ్లీ తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.


మార్చి నుండి మొదలవనున్న బాలయ్య, బోయపాటి మూవీలో మిగతా స్టార్ కాస్ట్ గురించి తెలియాల్సి ఉంది. మొత్తానికి బాలకృష్ణ రియల్ లైఫ్ లో సిఎం అయ్యో భాగ్యం ఉందో లేదో కాని సిల్వర్ స్క్రీన్ పై మాత్రం సిఎం బాలకృష్ణగా క్రేజ్ తెచ్చుకోనున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. దాని గురించి మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: