హాలీవుడ్ లో ఎంతో పాపులారటి సంపాదించిన బిగ్ బాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ రియాల్టీ షోకి హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా..ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.  హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ రియాల్టీ షో వస్తుంది.  తమిళ్ లో విశ్వనటుడు కమల్ హాసన్, మళియాళంలో మోహన్ లాల్, కన్నడలో కిచ్చ సుదీప్ లు హూస్ట్ లు గా ఉన్నారు. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హూస్ట్ గా ఉన్నారు. 

సెకండ్ సీజన్ కి మాత్రం నేచురల్ స్టార్ నాని వ్యవహరించారు.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 కి పెద్దగా క్రేజ్ రాకపోవడంతో..మళ్లీ ఎన్టీఆర్ తోనే బిగ్ బాస్ 3 కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నారు బిగ్ బాస్ యాజమాన్యం. ఆ మద్య బిగ్ బాస్ 3 సీజన్ కి అల్లు అర్జున్, విజయ్ దేవర కొండ, వెంకటేష్ లు హూస్ట్ గా ఉండబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అధికార ప్రకటన మాత్రం రాలేదు.   ప్రస్తుతం  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ మూవీ రూపొందిస్తున్నారు.  ఆర్ ఆర్ ఆర్ కోసం దర్శకదీరుడు రాజమౌళి బల్క్ డేట్స్ తీసుకోవడంతో తారక్ వేరే పనులేమీ పెట్టుకోవడం లేదని ముందు నుంచి అయితే ఒక క్లారిటీ ఉంది. 

మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం ఎలాగైనా సీజన్ 3కి తారక్ ని దింపాలని అనుకుంటోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే తారక్ కి ఇప్పుడు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  బిగ్ బాస్ సీజన్1 కి 14 కోట్ల వరకు ఇచ్చినట్లు అప్పట్లో టాక్. ఈ మద్య ఎన్టీఆర్ వరస విజయాలు అందుకుంటూ క్రేజ్ పెరిగిపోవడంతో బిగ్ బాస్ సీజన్ 3 కి  రూ. 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అంతా కుదిరితే..ఎన్టీఆర్ ని మరోసారి బుల్లితెరపై చూసే అవకాశం ఉండబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: