శ్రీదేవి కూతురు గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మొదటి సినిమా తోనే తనదైన ముద్ర ను వేయగలిగింది. అయితే జాన్వీ మ్యాగజైన్ లలో అందాల తో రెచ్చిపోతుంది. వరుసగా మ్యాగజైన్ కవర్ పేజీ మీద కనువిందు చేస్తుంది. ఇటీవలే డబు రత్నానీ క్యాలెండర్ పై అదిరిపోయే ఫోజుతో షాకిచ్చింది. 200 పర్సంట్ పరిణతి చెందిన టాప్ మోడల్ లా జాన్వీ ఇచ్చిన ఫోజు యువతరంలోకి దూసుకెళ్లింది. ఆ రూపం ఇంకా బోయ్స్ కళ్ల ముందు నుంచి చెరిగిపోక ముందే `హలో` (ఫిబ్రవరి డిజిటల్ కవర్) అంటూ పలకరించేసింది.

Image result for janhvi kapoor

అప్పుడే మొగ్గ నుంచి విచ్చుకుని పూర్తి పుష్పంగా మారినంతం అందంగా కనిపిస్తోంది ఈ లుక్ లో. పూవు పుట్టగానే పరిమళించును అన్న సూక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. మామ్ శ్రీదేవి వారసురాలిగా జాన్వీ తన స్థాయిని కాపాడుకోవడానికి ఎంతగా తపిస్తోందో తాజా ఫోటోషూట్లు చెబుతున్నాయి. ముద్ద మందారంలా రెడ్ హాట్ అప్పియరెన్స్ తో ఆకట్టుకుంది. ఇక కెరీర్ పరంగా పరిశీలిస్తే.. అందాల జాన్వీ కపూర్ ప్రస్తుతం కరణ్ జోహార్ తెరకెక్కించనున్న భారీ హిస్టారికల్ చిత్రం `తక్త్` లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో కరీనాకపూర్ - రణవీర్ సింగ్ - భూమి ఫెడ్నేకర్ - విక్కీ కౌవల్ వంటి టాప్  స్టార్లతో కలిసి నటించనుంది.

Image result for janhvi kapoor

అలాగే భారతదేశ తొలి పైలెట్ గా ఓ ప్రయోగాత్మక బయోపిక్ లోనూ జాన్వీ నటించనుంది. ఈ సినిమాల లైనప్ తో స్టార్ కిడ్ రేంజ్ ఒక్కసారిగా స్కైని టచ్ చేస్తోంది. నటించిన తొలి సినిమా ధడక్ లో నటన పరంగా చక్కని మార్కులు వేయించుకున్న జాన్వీ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన పనే లేనంతగా ప్లాన్ చేస్తున్నారు బోనీకపూర్. కరణ్ జోహార్ జాన్వీని తీర్చిదిద్దుతున్న తీరుపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: