ఎప్పుడైతే క్రిష్ బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా మొదలెట్టేడో అప్పటి నుంచి క్రిష్ కు కలిసి రావటం లేదు. తెలుగు లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ ఫ్లాప్ అయ్యింది. అయితే బాలీవుడ్ లో రిలీజ్ అయిన మణికర్ణిక వివాదం కొనసాగుతుంది.  సినిమా విడుదలయ్యింది.. విడుదలయ్యాక, క్రిష్‌ తెరకెక్కించింది సినిమాలో 30శాతం కూడా కాదంటూ కంగన తరఫునుంచి ఆమె చెల్లెలి ప్రకటన రూపంలో 'నిజం' బయటకొచ్చింది. అది నిజమా.? కాదా.? అన్నది కేవలం ఆ చిత్ర యూనిట్‌కి మాత్రమే తెలుస్తుంది. క్రిష్‌ మాత్రం 'మణికర్ణిక' తనదేనంటున్నాడు. క్రిష్‌ ఎంత గగ్గోలు పెట్టినా చివరికి నిర్మాత కూడా వినడంలేదాయె.. ఆ నిర్మాత కమల్‌ జైన్‌ మద్దతు కూడా కంగనకే లబించింది.

Image result for krish (director)

'మీ మీద కాస్తో కూస్తో వున్న గౌరవంతో టైటిల్స్‌లో మీ పేరు వేశాం.. పండగ చేస్కోండి..' అంటూ క్రిష్‌ పట్ల కంగన వెటకారంగా మాట్లాడుతున్నట్టుందిప్పుడు వ్యవహారం చూస్తోంటే. ఒక్కరంటే ఒక్కరు కూడా బాలీవుడ్‌ నుంచి క్రిష్‌ తరఫున మాట్లాడకపోవడం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే, 'మణికర్ణిక' విషయంలో క్రిష్‌ ఒంటరి అయిపోయాడు. 'చేతనైతే న్యాయపోరాటం చేస్కో' అని తాజాగా 'మణికర్ణిక' నిర్మాత కమల్‌ జైన్‌ ఇచ్చిన ఉచిత సలహాతో క్రిష్‌ పరిస్థితి మరింత దిగజారిపోయి వుంటుందన్నది నిర్వివాదాంశం.

Image result for krish (director)

బాలీవుడ్‌లో సినిమా.. అది కూడా 'మణికర్ణిక' లాంటి చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమా.. ఇలా ఆలోచించి క్రిష్‌ వెళ్ళాడుగానీ, కంగన గురించి ఇతరులు చేసిన ముందస్తు హెచ్చరికలేవీ పట్టించుకోకపోవడం వల్లనే క్రిష్‌కి ఈరోజు ఈ పరిస్థితి దాపురించిందన్నది చాలామంది నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. 'వాట్సాప్‌ ఛాట్‌' స్క్రీన్‌ షాట్స్‌ని క్రిష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం కూడా బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాక క్రిష్‌ ఇకపై చేయగలిగిందేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: