టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ‘భలే భలే మగాడివోయ్’సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్నారు.  ఆ మద్య నాని ద్విపాత్రాభినయంలో నటించిన 'కృష్ణార్జునల యుద్దం' కాస్త నిరాశపరిచింది. ఇటీవల నాగార్జున, నాని ‘దేవదాస్’సినిమా కు మిశ్రమ స్పందన వచ్చింది.   ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ'సినిమాలో నటిస్తున్నాడు. సాధారణంగా రోటీన్ కి భిన్నంగా ఉండే పాత్రల్లో నటించడానికి ఇష్టపడే నాని ఈ సారి ‘జెర్సీ’సినిమాలో నటిస్తున్నాడు.
Image result for నాని కృష్ణార్జునల యుద్దం
ఈ సినిమాలో క్రికెట‌ర్ పాత్ర‌తో పాటు మ‌రో భిన్న‌మైన పాత్రని చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా, ఏప్రిల్ 19న మూవీని విడుద‌ల చేయ‌నున్నారు.  ఈ సినిమా పూర్తయిన తర్వాత వెంటనే ‘మనం’ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని త‌న 24వ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పీసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేయ‌నుండ‌గా, ఫిబ్ర‌వ‌రి 19 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది.  అయితే ఈ సినిమాలో కూడా మరో ప్రయోగాత్మక పాత్రల్లోనే నటించబోతున్నాడట నాని. 
Image result for నాని కృష్ణార్జునల యుద్దం
ఒక మ‌నిషి జీవితం యొక్క నాలుగు వేర్వేరు ద‌శ‌ల‌ని చూపించ‌నున్నార‌ని అంటున్నారు. నాని నాలుగు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అంటే నాని 19 ఏళ్ళ టీనేజ‌ర్‌గాను , 25 ఏళ్ళ యువ‌కుడిగాను, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న మ‌ధ్య వ‌య‌స్కుడిగాను క‌నిపిస్తార‌ట‌. హాలీవుడ్ చిత్రం ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజ‌మిన్ బ‌ట‌న్ లైన్‌ని బేస్ చేసుకొని ఈ సినిమా తీస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, మేఘా ఆకాశ్ ఇందులో క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారని టాక్. ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ విలన్ గా కనిపించబోతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: