పాపం అఖిల్ ఎన్ని సినిమా లు తీసిన హిట్ మాత్రం కొట్ట లేక పోతున్నాడు. దీనితో ఏం చేయాలో నాగార్జున కు అర్ధం కావటం లేదు. అఖిల్ ను మంచి హీరోగా టాలీవుడ్ లో సెట్ చేద్దామనుకుంటున్న నాగార్జున ... అఖిల్ అయితే ఇంత వరకు హిట్ రాలేదు. ఖిల్ కోసం ఒక తండ్రిగా నాగార్జున ఎంత చెయ్యాలో అంతా చేస్తున్నాడు. కానీ హిట్ అనేది మాత్రం రావడం లేదు. ఫస్ట్ సినిమాకు వినాయక్ని పట్టుకొచ్చాడు. రెండో సినిమాకు విక్రమ్ - మూడో సినిమాకు వెంకీ అట్లూరితో సినిమాలు తీశాడు. అయితే.. ఈ మూడు సినిమాలు పరాజయం కాక తప్పలేదు.

Image result for akhil and nagarjuna

వినాయక్ విక్రమ్.. ఇద్దరూ మంచి డైరెక్టర్లే. అందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అలాగే.. వారి కెరీర్ లో ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఇక వెంకీ అట్లూరి క్లాస్ డైరెక్టర్. కేవలం ఒక్క సినిమా అనుభవంతో మిస్టర్ మజ్ను సినిమా ఇవ్వడం అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు అఖిల్ నాలుగో సినిమాను క్రిష్ తో చేయించాలని అనుకుంటున్నాడు నాగార్జున. ఇలా అందర్ని ట్రై చేస్తున్న నాగార్జునకు కళ్లముందున్న అనిల్ రావిపూడి మాత్రం కన్పించడం లేదు.

Image result for anil ravipudi

అనిల్ రావిపూడి-అఖిల్ కాంబినేషన్ లో సినిమా వస్తే హిట్ కొట్టడం పక్కా.అనిల్ రావిపూడి క్లాస్ ప్లస్ మాస్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయగలడు. కామెడీతో పాటు యాక్షన్ కూడా బాగా తీస్తాడు. అన్నింటికి మించి సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో తీయగలడు. ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీస్తే నాలుగు సూపర్ హిట్లే. ఇలాంటి దర్శకుడ్ని వదిలేసి.. ఏవేవో ప్రయోగాలు చేస్తూ అఖిల్ కెరీర్ తో ఆడుకుంటున్నాడు నాగార్జున. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను ఇంకా కమిట్ అవ్వలేదు. ఇలాంటి టైమ్ లో అనిల్ ని లాక్ చేసుకుని అఖిల్ ని అప్పగిస్తే ఇద్దరి కాంబినేషన్ లో మంచి హిట్ వస్తుంది. ఇప్పటికైనా నాగార్జున అనిల్ రావిపూడి గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: