టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో లక్కీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.  ‘పెళ్లిచూపులు’సినిమాలో హీరోగా నటించి ‘అర్జున్ రెడ్డి’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  గీతాగోవిందం సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ యువ హీరో తర్వాత వచ్చిన టాక్సీవాలతో మరో విజయాన్ని అందుకున్నాడు.  ప్రస్తుతం అర్జున్ రెడ్డి మూవీ బాలీవుడ్, కోలీవుడ్ లో  రిమేక్ అవుతున్నాయి. తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా విజయ్ దేవరకొండ సత్తా చాటుతున్నాడు.  


ఇటీవల నోటా సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న తెలుగు  సినిమాలని వేరే భాష‌ల‌లో డ‌బ్ చేసి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మూవీ మేక‌ర్స్‌.  శ్రీనివాస రవీంద్ర దర్శకత్వంలో విజ‌య్ దేవ‌రకొండ‌, పూజా జ‌వేరి ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన సినిమా ద్వార‌క‌.  ప్రకాశ్‌రాజ్‌, ప్రభాకర్‌, మురళీ శర్మ, సురేఖలు ఇతర పాత్రలో నటించారు. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించారు. సాయికార్తిక్‌ సంగీతం సమకూర్చారు. 


ఈ సినిమాను శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ బ్యానరుపై ఏఎన్‌ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు. తెలుగు లో బాగా పాపులర్ అయిన ‘అర్జున్ రెడ్డి’టైటిల్ తో డ‌బ్బింగ్ వ‌ర్షెన్‌ని త‌మిళంలో విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం తెలిపింది. పెళ్లిచూపులు సినిమా తర్వాత విజయ్ నటించిన ద్వారక సినిమా నటించాడు. ప్రేమ, యాక్షన్‌, కమర్షియల్‌ వంటి అంశాలన్నీ కలగలిసిన ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక‌ని త్వ‌ర‌లోనే నిర్వ‌హించి ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌ని ముఖ్య అతిధిలుగా ఆహ్వానించ‌నున్న‌ట్టు వారు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: