రకుల్ ప్రీతీ సింగ్ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలా సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను త్వరగానే అందుకున్నది. అయితే వరుసగా అమ్మడికి ఫ్లాప్స్ రావటంతో తెలుగు లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటి వరకు తెలుగు లో సైన్ చేసిన సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. పోనీ హిందిలో సెటిల్ అవుదామని అయారి మీద బోలెడు ఆశలు పెట్టుకుంటే అదీ డిజాస్టర్ అయ్యింది. 


రకుల్ చాలా దిగజారి పోయిందే ..!

అయితే దీపం వెలుగుతుండగానే ఫిట్నెస్ జిమ్ముల వ్యాపారంలో దిగిపోయి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారి బోలెడంత పాపులారిటీ తెచ్చింది. తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల జిమ్ములు ప్రారంభించి నెలవారీ ఆదాయం ఆర్జిస్తోంది. జిమ్ము పెట్టగానే సంబరమా?  బ్రాండ్ అంబాసిడర్ గా స్థాయి నిలుపుకోవాలంటే అందుకు ఎంతో శ్రమించాలి. ఓవైపు సినీకెరీర్ ని కాపాడుకోవాలి. మరోవైపు జిమ్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలి. అందుకు తగ్గట్టే రకుల్ హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చట కలగకుండా మానదు. కేవలం జిమ్ లోనే వారానికి 12 గంటలు పైగా గడిపేస్తోందిట. ఇదిగో ఇలా కఠినమైన వ్యాయామాలు చేస్తోంది.


రకుల్ చాలా దిగజారి పోయిందే ..!

ఈ కష్టం పగోడికైనా కలగకూడదు! అన్నంతగా శ్రమిస్తోంది.ఫిట్ నెస్ తో ఆరోగ్యం దాంతోనే ఆదాయం ఎలానో రకుల్ ఓ ఫార్ములాని కనిపెట్టింది. అలాగే ఈ అమ్మడు కేవలం సౌత్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ కెరీర్ కోసం చక్కని ప్రణాళికతో దూసుకుపోతోంది. అక్కడ యువహీరో సిద్ధార్థ్ సరసన `మార్జవాన్` అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా కోసం తన రూపాన్ని ఇంకా తీరుగ్గా మార్చుకునేందుకు  కఠోరంగా శ్రమిస్తోందిట. నిరంతరం జిమ్ముల్లోనే టైమ్ స్పెండ్ చేస్తూ యోగ సాధనకు సమయాన్ని వెచ్చించి రూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అందుకోసం నిపుణుడైన ట్రైనర్ నియమించుకుంది. రకుల్ బాలీవుడ్ ప్రిపరేషన్స్ ఎంత కఠోరంగా ఉంటాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: