తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలక్రిష్ణది ఓ రూట్, నాగర్జున వెంకటేష్ ది మరో రూట్. నిజానికి బాలయ్య, చిరు దాదాపుగా ఒకే టైంలో సినిమాల్లోకి వచ్చారు. వెంకీ, నాగ్ కూడా ఓ ఏడాది తేడాతో వెండి తెరపై మెరిపించారు. ఇపుడు చూడబోతే ఈ నలుగురు టాప్ స్టార్స్ సీనియర్లు అయిపోయారు. కానీ వారికి తగిన కధలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నారు. ఈ రేసులో నాగ్, వెంకీ ఈ మధ్య వెనకబడ్డారు. ఇపుడు వారిద్దరికీ ఓ సక్సెస్ మంత్రం దొరికిందిట.


అదేంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే కామేడీ అన్న మాట. వల్గారిటీ పెద్దగా లేకుండా కామెడీ చేస్తే తమకు విజయమూ దక్కుతుంది. హీరోయిజమూ నిలుస్తుందని నాగ్, వెంకీ భావిస్తున్నారుట. లేటెస్ట్ హిట్ ఎఫ్ 2 హిట్ తో వెంకీ ఆ తరహా కామెడీ ట్రాక్ కి డిసైడ్ అయిపోయాడుట. ఆయన కొత్త మూవీ వెంకీ మామలో ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుందని అంటున్నారు. ఇక వెంకీ బాటలోనే నాగ్ కూడా దూసుకురావాలని అనుకుంటున్నాడుట.


నాగ్ రెండు కొత్త మూవీస్ లైన్లో పెట్టాడు. అందులో ఒకటి బంగార్రాజు సీక్వెల్ అయితే రెండోది మన్మధుడు 2. ఈ రెండు మూవీలో ఫుల్ కామెడీ పండించాలని నాగ్ ఆదేశాలు జారీ చేశాడట. తన మూవీస్ అంటే మహిళలు,  ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వారికి ఇబ్బందిలేని విధంగా కామెడీని వండి వార్చమని నాగ్ రచయితలు, దర్శకులకు డైరెక్షన్ ఇచ్చేశారట. దాంతో నాగ్ ఇక వెంకీ బాటలో ఫన్ పంచేదుకు రెడీ అవుతున్నాడన్నమాట. 


ఈ రెండు మూవీస్ రిలీజ్ కి కూడా డేట్స్  రెడీ అయిపోయాయి. ఒకటి దసరాకు, మరోటి సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగ్ భావిస్తున్నడుట. అంటే మొత్తానికి కామెడీ ట్రాక్ తో కొత్త హిట్లు పట్టేయాలని నాగ్ డిసైడ్ అయ్యాడన్నమాట. మరో వైపు బాలయ్య, చిరు సీరియస్ యాక్షన్ మూవీస్ వైపు ద్రుష్టి పెట్టడం విశేషం. ఆ మూవీస్ వారికి మాత్రమే పండుతాయి. సో ఇలా సీనియర్లు నలుగురు తమకు నచ్చిన, అచ్చి వచ్చిన రూట్లలో దూసుకుపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: