సాధారణంగా ఒక సినిమా టైటిల్, డిజైన్ మరో సినిమాకు ఉండటం అనేది జరగనిపని..కానీ ఈ మద్య ‘ముద్ర’సినిమా టైటిల్ వివాదం ఓ రేంజ్ లో కొనసాగింది.   యువ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ ఆ మద్య రిలీజ్ అయ్యింది.  ఈ మద్య ఇదే టైటిల్ ‘ముద్ర’ సినిమా రిలీజ్ అయ్యింది.  దాంతో వివాదం పెద్ద ఎత్తున కొనసాగింది.  అయితే ఒకే సినిమా టైటిల్ రెండు సార్లు..అది కూడా ఒకే డిజైన్ తో ఎలా ఉంటుందని హీరో నిఖిల్ పెద్ద ఎత్తున రగడ చేశారు.  మొత్తానికి ఈ వివాదానికి పులిస్టాప్ పెడుతూ...నిఖిల్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కొత్త టైటిల్ పెట్టారు.   
Image result for nikhil arjun suravaram
తాజాగా ఈ సినిమాకి 'అర్జున్ సురవరం' టైటిల్ ను ఖరారు చేసి .. ఫస్టులుక్ ను వదిలారు.  ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతున్నట్లు సమాచారం.  న్యూస్ ఛానల్ కి సంబంధించిన ఓబీ వ్యాన్ రన్నింగ్ లో ఉండగా .. దాంట్లో నుంచి సీరియస్ గా ఫోటోలు తీస్తూ ఈ పోస్టర్లో నిఖిల్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్రపేరు 'అర్జున్ సురవరం' .. అదే టైటిల్ ను ఖరారు చేయడం విశేషం.  గతంలో మీడియాకు సంబంధించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. 

ఓ కేసు కోసం హీరో మీడియాను ఉపయోగించుకోని ఎలా పోరాడుతాడు అన్న విషయం సినిమాలో చక్కగా చూపించబోతున్నారట.  మార్చి 29న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 2016లో తమిళంలో వచ్చిన 'కణిథన్' సినిమాకి ఇది రీమేక్. అధర్వ మురళి .. కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. వైవిధ్యభరితమైన కథతో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లో సక్సెస్ అందుకుంటుందా లేదా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: