ఓ సినిమాను ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లడంలో ప్రచార చిత్రాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ క్రమంలో అడల్ట్ సినిమాలైతే ఇంకా చెప్పాల్సిన పనిలేకుండా ఉంటుంది. బూతు కంటెంట్ ను పైకి చిరాకు చూపించినా ఒంటరిగా ఉన్నప్పుడు చూసేది అదే. ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ట్రైలర్ చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా ట్రైలర్.


ఆదితి, నిక్కి తంబోలి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా అడల్ట్ కంటెంట్ తో హర్రర్ మిక్స్ కామెడీ సినిమాగా వస్తుంది. రెండు రోజుల క్రితం రిలీజైన ఈ సినిమాలో బూతు కంటెంట్ బాగా దట్టించేశారు. ఇంకేముందు ఎలాగు జియో డేటా ఫోన్లో ఉంటుంది కాబట్టి ఆ ట్రైలర్ తెగ చూసేశారు. ఎంతగా అంటే రెండు రోజుల్లో ఆ చిన్న సినిమా ట్రైలర్ ను 3 లక్షల వ్యూస్ సాధించేలా చూశారు.


ట్రైలర్ చూసి చీ చీ ఇది ఓ సినిమానా అనేసుకున్నా ఆ ట్రైలర్ చూసి సొల్లు గారుస్తున్నారు. ఫైనల్ గా అడల్ట్ కంటెంట్ సినిమాలకు ఎప్పటికి క్రేజ్ ఉంటుందని ఈ సినిమా ట్రైలర్ వ్యూస్ చూస్తే అర్ధమవుతుంది. మొన్నామధ్య వచ్చిన ఏడు చేపల కథ ట్రైలర్ కూడా అంతే మిలియన్స్ వ్యూస్ సాధించింది. సో స్టార్ హీరో సినిమాలకు ఆటోమెటిక్ గా వ్యూస్ వస్తే.


ఇలాంటి అడల్ట్ కంటెంట్ ట్రైలర్స్ కు ఎవరికి వారు అందులో విషయం ఏముందో అన్నట్టుగా ట్రైలర్ చూసేస్తున్నారు. సినిమాలో మ్యాటర్ ఏముంటుందో కాని చీకటి గదిలో చితక్కొట్టుడు ట్రైలర్ యూట్యూబ్ లో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. దర్శక నిర్మాతలు ఏదైతే అనుకున్నారో దానికి రీచ్ అయ్యారని చెప్పొచ్చు. ఈ వ్యూస్ సినిమా ఓపెనింగ్ రోజు కలక్షన్స్ తెచ్చేలా చేస్తాయో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: