వినయ విధేయ రామ ఫ్లాప్ రామ్ చరణ్ ను బాగా కుంగ దీసి నట్టుంది. ఏకంగా సినిమా ఫ్లాప్ అయ్యినందుకు అభిమానులకు సారీ చెబుతూ ఒక లేఖ రాశాడు .అయితే  తమ వైఫల్యాన్ని అంగీకరిస్తూ, ప్రేక్షకులకు సారీ చెబుతూ, సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు చెబుతూ, నిర్మాత దానయ్యను అక్కున చేర్చుకుంటూ, దర్శకుడు బోయపాటిని మాత్రం వదిలేస్తూ, రామ్ చరణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు.

Image result for ram charan

పనిలో పనిగా పంపిణీదారులను, ఎగ్జిబిటర్లను, మీడియాను కూడా రామ్ చరణ్ తలుచుకున్నారు. ఒక్క బోయపాటిని మినహా. అయితే ఇప్పుడు వున్నట్లుండి రామ్ చరణ్ ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది పెద్ద ప్రశ్న. సినిమా విడుదలై అంతా అయిపోయి, బిజినెస్ క్లోజ్ అయిపోయాక ఇప్పుడేందుకు ఈ కెలుకుడు? వినయ విధేయరామ సినిమా మేకింగ్ సమయంలోనే బోయపాటితో నిర్మాత దానయ్యకు అంతగా పొసగలేదు. కొన్ని విషయాల్లో హీరో రామ్ చరణ్ కూడా బోయపాటి మాట వినలేదు. ఆ ఉక్రోషంతోనే బోయపాటి సినిమా విడుదల దగ్గర పడేవరకు కనీసం ఓ స్టిల్ వదలడం, ప్రచారం పట్టించుకోవడం వంటివి చేయలేదు.

వెన్నుపోటుకు చరణ్ పెన్నుపోటు?

వినయ విధేయను సంక్రాంతి బరిలోకి దిగకుండా చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. కానీ బాలయ్య కథానాయకుడు సినిమాను చరణ్ సినిమా ఢీకొనక తప్పలేదు. అప్పుడే వినయ విధేయకు ఏవీ వదలకపోవడం వెనుక, దర్శకుడు బోయపాటికి బాలయ్యతో వున్న విధేయత కారణం కావచ్చు అంటూ గుసగుసలు వినిపించాయి. తరువాత ఆయన చేయబోయే సినిమా కూడా బాలయ్యదే. అందువల్ల ఇంతకీ ఈ సినిమాను ఏం చేస్తారో? అని క్వశ్చన్లు కూడా వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: